Skip to main content

AP Inter Top Rankers : ఫ‌లితాల్లో మెరిసిన జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థులు.. వీరి ల‌క్ష్యాలు ఇవే..

ఏపీ ఇంట‌ర్ బోర్డు ఫ‌లితాలు శ‌నివారం.. 12వ తేదీన విడుద‌లైయ్యాయి.
AP junior college students tops in board exam

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఏపీ ఇంట‌ర్ బోర్డు ఫ‌లితాలు శ‌నివారం.. 12వ తేదీన విడుద‌లైయ్యాయి. ఈ ప‌రీక్ష‌లో ఎంద‌రో విద్యార్థులు ఉన్న‌త మార్కులు సాధించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఇక‌, వారితో మాట్లాడ‌గా వారి ప్ర‌యాణాలు, భ‌విష్య‌త్తు గ‌మ్యాలు, ఉన్న‌త విద్య గురించి పంచుకున్నారు. అందులో, కొంద‌రి వివ‌రాలు, ల‌క్ష్యాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం..

ఇంజినీర్‌ కావాలని ఉంది

ఎంపీసీ గ్రూపులో 976 మార్కులు వచ్చాయి. మా తల్లిదండ్రులు కష్టపడి పడి చదివించారు. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లి వారి ఆశయాన్ని నెరవేరుస్తా. నేను భవిష్యత్తులో ఇంజినీర్‌ కావాలని ఉంది. 

– వెన్నెల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆళ్లగడ్డ

Anganwadi Centers : సెల్‌ఫోన్లతో అవ‌స్థ‌లు.. ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్‌

డాక్టర్‌గా పేదలకు సేవలు అందిస్తా

నీట్‌లో ప్రతిభ చాటి ఎంబీబీఎస్‌ సీటు సాధిస్తా. డాక్టర్‌ వృత్తి చేపట్టాలని ఉంది. పేదలకు ఉచితంగా సేవ చేస్తా. ఇంటర్‌లో 968 మార్కులు సాధించేందుకు కళాశాల అధ్యాపకులు కృషి, తల్లిదండ్రల ప్రోత్సాహం ఎంతో ఉంది.

– దేవరాజ్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నంద్యాల

చాలా సంతోషంగా ఉంది

మాది శ్రీపతిరావుపేట గ్రామం. నేను ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ చదువుతూ 470 మార్కులకు గానూ 462 మార్కులు సాధించాను. మా నాన్న ఓ ప్రయివేట్‌ కళాశాలలో పని చేస్తున్నారు. నన్ను ఇంజినీర్‌గా చూడాలన్నదే మా నాన్న లక్ష్యం. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సెకండియర్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటా.

– ఆవుల వెంకటగౌరి, ఆత్మకూరు

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Apr 2025 04:34PM

Photo Stories