Telangana Police: పోలీసింగ్‌లో తెలంగాణ నంబర్ వన్.. ఏపీ రెండో స్థానం..

అత్యుత్తమ పోలీసింగ్‌కు సంబంధించి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్–2025 ర్యాంకింగ్‌లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఏపీ రెండో స్థానంలో ఉంది. పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ పనితీరుపై ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) 2019 నుంచి ప్రతి ఏటా నివేదిక విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజా రిపోర్టు ఏప్రిల్ 15వ తేదీ విడుదలైంది.
ముఖ్యమైన అంశాలు..
పోలీసింగ్‌లో తెలంగాణ టాప్: అత్యుత్తమ పోలీసింగ్‌కు సంబంధించి తెలంగాణ 10 మార్కులకు 6.48 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఈ విభాగంలో రెండో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ అత్యల్పంగా 3.36 మార్కులతో చివరి స్థానంలో ఉంది.
సమగ్ర ర్యాంకింగ్‌లో తెలంగాణ స్థానం: పోలీస్, న్యాయవ్యవస్థ, జైళ్లశాఖ, లీగల్ ఎయిడ్ పనితీరును కలిపి చూస్తే, తెలంగాణ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉంది. గత నివేదికలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి గణనీయమైన మెరుగుదల చూపింది.
సమగ్ర ర్యాంకింగ్‌లో మొదటి స్థానం: అన్ని విభాగాల పనితీరును కలిపి 2025లో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. తెలంగాణ, కేరళ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Police: దేశంలో లక్ష మంది జనాభాకు ఎంత మంది పోలీసులున్నారో తెలుసా..?
పోలీస్-పౌరుల నిష్పత్తి: జాతీయ స్థాయిలో ప్రతి లక్ష మంది పౌరులకు సగటున 155 మంది పోలీసులు ఉన్నారు. బిహార్‌లో ఈ సంఖ్య అతి తక్కువగా లక్ష మందికి 81 మందిగా ఉంది.
ఖైదీల సంఖ్య పెరుగుదల: గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంఖ్య 50 శాతం పెరిగింది. విచారణ ఖైదీల (Under-trial prisoners) సంఖ్య 66 శాతం నుంచి 76 శాతానికి పెరిగింది.
బడ్జెట్ కేటాయింపులు: రాష్ట్రాల బడ్జెట్‌లలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌కు కేటాయించే నిధుల్లో ఎక్కువ భాగం జీతభత్యాలకే ఖర్చవుతోంది. మౌలిక సదుపాయాలకు చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు.
పోలీస్ శాఖలో మహిళలు: దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో మహిళల సంఖ్య కేవలం 8 శాతం మాత్రమే ఉంది. మహిళా అధికారుల సంఖ్య 10 శాతానికి పరిమితమైంది. తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది 8.7 శాతం, మహిళా అధికారులు 7.6 శాతంగా ఉన్నారు.
APSRTC: ఆంధ్రప్రదేశ్‌కి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఈ నగరాల్లోనే..