Skip to main content

AP Inter Supplementary Exams 2025: మే 12 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. రీకౌంటింగ్‌/రీవెరిఫికేషన్‌కు చివరి తేదీ ఇదే

ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత కాని విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు మరో అవకాశం కల్పించింది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. 
Notice board with AP Inter exam dates  AP Inter Board notice about supplementary exams  AP Intermediate supplementary exam schedule announcement   AP Inter 1st, 2nd Year Supplementary Exam Date 2025 OUT Check Time Table
AP Inter 1st, 2nd Year Supplementary Exam Date 2025 OUT Check Time Table

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌..

మే 12 నుంచి ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మద్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు‌ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. 

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ.. 

పరీక్షలో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 15-22 వరకు ఫీజులు చెల్లించుకోవచ్చు. ఇక విద్యార్థులు తమకు వచ్చిన మార్కులపై సందేహాలుంటే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈనెల 22 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. 

TS Inter Advanced Supplementary Exams 2023 from June 12th: Check Complete  Schedule Here | Sakshi Education

 

AP Inter Supplementary 2025 Time Table

తేదీ 1st Year (ఉదయం 9AM–12PM) 2nd Year (మధ్యాహ్నం 2:30PM–5:30PM)
మే 12 2nd లాంగ్వేజ్ పేపర్-I 2nd లాంగ్వేజ్ పేపర్-II
మే 13 ఇంగ్లీష్ పేపర్-I ఇంగ్లీష్ పేపర్-II
మే 14 మ్యాథ్స్-IA / బోటనీ / సివిక్స్ పేపర్-I మ్యాథ్స్-IIA / బోటనీ / సివిక్స్ పేపర్-II
మే 15 మ్యాథ్స్-IB / జూయాలజీ / హిస్టరీ పేపర్-I మ్యాథ్స్-IIB / జూయాలజీ / హిస్టరీ పేపర్-II
మే 16 ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-I ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-II
మే 17 కెమిస్ట్రీ / కామర్స్ / సోషియాలజీ / ఫైన్ ఆర్ట్స్ పేపర్-I కెమిస్ట్రీ / కామర్స్ / సోషియాలజీ / ఫైన్ ఆర్ట్స్ పేపర్-II
మే 19 పబ్లిక్ అడ్మిన్ / లాజిక్ / బ్రిడ్జ్ మ్యాథ్స్ పేపర్-I పబ్లిక్ అడ్మిన్ / లాజిక్ / బ్రిడ్జ్ మ్యాథ్స్ పేపర్-II
మే 20 మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-I మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-II


AP ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు - ముఖ్యమైన తేదీలు

  • పరీక్షల తేదీలు: మే 12- 20,వరకు
  • ఫస్ట్ ఇయర్ పరీక్షలు: ఉదయం 9:00AM - 12:00PM
  • సెకండ్ ఇయర్ పరీక్షలు: మధ్యాహ్నం 2:00PM - 5:00PM
  • ప్రాక్టికల్ పరీక్షలు: మే 28 నుండి జూన్ 1, 2025 వరకు

AP Inter Advanced Supplementary Exams 2022 Schedule; Check Last Date to  Apply | Sakshi Education

ఫీజు చెల్లింపులకు చివరి తేదీ

సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 15- 22వరకు

రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ అప్లికేషన్: ఏప్రిల్ 13-22 వరకు

అధికారిక వెబ్‌సైట్: bie.ap.gov.in

AP Inter 1st Year Supplementary Exams 2022 Time Table; Check Study Material  | Sakshi Education

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 15 Apr 2025 01:03PM

Photo Stories