Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌:ఇంటర్‌ తప్పిన విద్యార్థులు 22లోగా పరీక్షఫీజు చెల్లించాలి

బ్రేకింగ్ న్యూస్‌:ఇంటర్‌ తప్పిన విద్యార్థులు 22లోగా పరీక్షఫీజు చెల్లించాలి   Notice about fee payment deadline for intermediate improvement exams  Rs. 600 fee for improvement exam per subject for 1st and 2nd year students
బ్రేకింగ్ న్యూస్‌:ఇంటర్‌ తప్పిన విద్యార్థులు 22లోగా పరీక్షఫీజు చెల్లించాలి

ఇటీవల మార్చి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం ఇంటర్‌ బోర్డు పేర్కోన్న నిర్ణీత గడువులోగా ఫీజులు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ ఫీజు చెల్లించేందుకు తుది గడువు అనే విషయాన్ని విద్యార్థుల తల్లితండ్రులు గమనించాలని కోరారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరాల్లో గ్రూప్‌ సబ్జెక్టులకు సంబంధించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు.

సబ్జెక్టు వారీగా ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.600తో పాటు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చెప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.275, ఒకేషనల్‌ బ్రిడ్జ్‌ కోర్సులకు హాజరయ్యే వారు రూ. 165 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ బీఐఈ.ఏపీ.జోఓవీ.ఐన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ నెల 22వ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలు మే.28 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నైతికత, మానవ విలువలు పరీక్ష జూన్‌ 4న, పర్యావరణ విద్య పరీక్ష జూన్‌ 6న జరగనున్నట్లు వివరించారు.

AP Inter Supplementary 2025 Time Table

తేదీ 1st Year (ఉదయం 9AM–12PM) 2nd Year (మధ్యాహ్నం 2:30PM–5:30PM)
మే 12 2nd లాంగ్వేజ్ పేపర్-I 2nd లాంగ్వేజ్ పేపర్-II
మే 13 ఇంగ్లీష్ పేపర్-I ఇంగ్లీష్ పేపర్-II
మే 14 మ్యాథ్స్-IA / బోటనీ / సివిక్స్ పేపర్-I మ్యాథ్స్-IIA / బోటనీ / సివిక్స్ పేపర్-II
మే 15 మ్యాథ్స్-IB / జూయాలజీ / హిస్టరీ పేపర్-I మ్యాథ్స్-IIB / జూయాలజీ / హిస్టరీ పేపర్-II
మే 16 ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-I ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-II
మే 17 కెమిస్ట్రీ / కామర్స్ / సోషియాలజీ / ఫైన్ ఆర్ట్స్ పేపర్-I కెమిస్ట్రీ / కామర్స్ / సోషియాలజీ / ఫైన్ ఆర్ట్స్ పేపర్-II
మే 19 పబ్లిక్ అడ్మిన్ / లాజిక్ / బ్రిడ్జ్ మ్యాథ్స్ పేపర్-I పబ్లిక్ అడ్మిన్ / లాజిక్ / బ్రిడ్జ్ మ్యాథ్స్ పేపర్-II
మే 20 మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-I మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-II

AP ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు - ముఖ్యమైన తేదీలు

  • పరీక్షల తేదీలు: మే 12- 20,వరకు
  • ఫస్ట్ ఇయర్ పరీక్షలు: ఉదయం 9:00AM - 12:00PM
  • సెకండ్ ఇయర్ పరీక్షలు: మధ్యాహ్నం 2:00PM - 5:00PM
  • ప్రాక్టికల్ పరీక్షలు: మే 28 నుండి జూన్ 1, 2025 వరకు

ఫీజు చెల్లింపులకు చివరి తేదీ

సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 15- 22వరకు

రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ అప్లికేషన్: ఏప్రిల్ 13-22 వరకు

అధికారిక వెబ్‌సైట్: bie.ap.gov.in

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Apr 2025 03:47PM

Photo Stories