Degree Semester Exam Results: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్ నెలల్లో జరిగిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు.
Degree Semester Exam Results
రెండో సెమిస్టర్ పరీక్షలకు 6,376 మంది హాజరు కాగా 2,752 మంది, నాల్గవ సెమిస్టర్‌కు 5,735 మందికి 3,133 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.
ఫలితాలు htt pr://rayaaree mauniverrity.ac.in వెబ్‌సైట్‌లో అందుబా టులో ఉన్నాయని తెలిపారు. రీ వాల్యుయే షన్ చేయంచాలనుకునే వారు ఈనెల 10వ తేదీలోగా సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.