Degree Results: రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ సప్లిమెంటరీ రీ వాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు.
Degree Results Degree revaluation Exam Results
వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలను https://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. 571 మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే 122 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.