DSC Free Coaching: ఉచితంగా డీఎస్సీ కోచింగ్.. దరఖాస్తుకు ఇదే చివరి తేది
Sakshi Education
కాకినాడ సిటీ: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకినాడ జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు జనవరి 2, 2025 నుంచి కాకినాడలో ఉచిత శిక్షణ తరతులు ప్రారంభించనున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారిత అధికారి ఎం.సుబ్బారావు బుధవారం ప్రకటనలో తెలిపారు. స్టైఫండ్, బుక్స్ అలవెన్సు సౌకర్యాలు ఉన్నాయన్నారు.
DSC Free Coaching Free coaching for AP DSC candidates for teacher posts
అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు వారి రెజ్యూమ్‌తో పాటు 10వ తరగతి, ఇంటర్, క్యాస్ట్, ఎస్‌జీటీ టెట్ క్వాలిఫై కాపీ, రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, సెల్ఫ్ అడ్రస్ కవర్, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయం, ప్రగతి భవనం, 2వ అంతస్థు, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఎదురుగా, కాకినాడ చిరునామాకు ఈ నెల 28వ తేదీ లోపు పంపాలి. వివరాలకు 0884–2379216 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.