Skip to main content

Campus Placements 2025 : క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 279 మంది విద్యార్థులు ఎంపిక

తెనాలి: ప్రపంచవ్యాప్త సంస్థలకు టెక్నాలజీ మద్దతునిస్తున్న ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ సదర్‌లాండ్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ స్థానిక ఏఎస్‌ఎన్‌ డిగ్రీ కాలేజిలో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో 279 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి రూ.2.40 లక్షల నుంచి రూ.2.70 లక్షల వార్షిక ప్యాకేజితో కంపెనీ ఆఫర్‌ లెటర్లను అందించినట్టు ఏఎస్‌ఎన్‌ విద్యాసంస్థల చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ చెప్పారు.
279 candidates selected by Sutherland Global Services for job offers   Campus Placements 2025   Sutherland Global Services campus interview selection at ASN Degree College
Campus Placements 2025

కాలేజిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదర్‌ ల్యాండ్‌ సంస్థ దశలవారీగా చేసిన ఇంటర్వ్యూల అనంతరం తాజాగా ఎంపిక జాబితాతో సహా ఆఫర్‌ లెటర్‌లను పంపినట్టు వివరించారు. ఒకే మల్టీనేషనల్‌ సంస్థకు ఇంత భారీసంఖ్యలో ఉద్యోగాలకు ఎంపికవటం గర్వకారణమన్నారు. కొత్త కోర్సులు, నాణ్యమైన విద్యాబోధనతో పాటు గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ కోర్సులకు శిక్షణనిస్తూ అత్యధిక క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు సాధిస్తున్నామని తెలియజేశారు.

Walk-in-Interview: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా, నెలకు రూ. 20,000

Campus Placement: క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు..  | Sakshi Education

దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గల కంపెనీల్లోనూ తమ విద్యార్థులు ఉద్యోగాలను సాధిస్తుండటం విశేషమన్నారు. ఎంపికై న విద్యార్థులను అభినందిస్తూ వారికి ఆఫర్‌ లెటర్లను అందజేశారు. కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కొలసాని రామ్‌చంద్‌ మాట్లాడుతూ విద్యార్థులకు గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను ఉచితంగా అందిస్తూ, అందుకయే ఖర్చును కాలేజి యాజమాన్యం భరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం నుండి గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల శిక్షణ ఆరంభించినట్టు చెప్పారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 30 Jan 2025 01:01PM

Photo Stories