Skip to main content

Bucket System in Degree Courses : ఇక‌పై డిగ్రీలో బ‌కెట్ సిస్ట‌మ్ ర‌ద్దు కానుందా..!! అస‌లేమిటిది..!

డిగ్రీలో నచ్చిన కోర్సును ఎంపికచేసుకునే బకెట్‌ ఆఫ్‌ కోర్సెస్‌(బీవోసీ) సిస్టం రద్దు చేసి పాత విధానానికే నాంది ప‌ల‌క‌నున్నార‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు..
Will there be any cancellation of bucket system in degree courses  Announcement of the return to the old degree course selection system

సాక్షి ఎడ్యుకేష‌న్: డిగ్రీలో కోర్సు ఎంపిక‌లో మ‌రోసారి పాత విధానాన్నే త‌ర‌లిస్తున్నారు. డిగ్రీలో నచ్చిన కోర్సును ఎంపికచేసుకునే బకెట్‌ ఆఫ్‌ కోర్సెస్‌(బీవోసీ) సిస్టం రద్దు చేస్తున్నారు. ఇక‌పై, పాత విధానాన్నే వెలుగులోకి తీసుకురావాల‌ని యోచిస్తున్నారు. కానీ, ఈ విధానాన్ని ప‌లు క‌ళాశాల‌లు వ్య‌తిరేకిస్తున్నారు. గ‌తంలో, డిగ్రీలో ఈ బీఓసీ విధానాన్ని అమ‌లు చేశారు. అంటే, 2021 విద్యా సంవ‌త్స‌రంలో ఈ విధానాన్ని అమ‌లు చేశారు. ఇప్పుడు ర‌ద్దు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

అస‌లు బీఓసీ అంటే..

2021వ విద్యాసంవ‌త్స‌రంలో అమ‌లు చేసిన బీఓసీ విధానం అంటే, బ‌కెట్ ఆఫ్ కోర్సెస్‌. ఈ విధానంలో, విద్యార్థులు త‌మ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టు మాత్ర‌మే కాకుండా, ఇత‌ర కోర్సుకు సంబంధించిన స‌బ్జెక్టును కూడా ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది. అంటే, ఉదాహ‌ర‌ణ‌కు.. బీఎస్సీ కోర్సు విద్యార్థులు సైన్స్ స‌బ్జెక్టు ఉంటుంది. అదే కాకుండా, ఇత‌ర కోర్సు అంటే, బీకాం కోర్సుకు సంబంధించిన ఒక స‌బ్జెక్టును ఎంపిక చేసుకోవ‌చ్చు అని అర్థం.

Technical Certificate Course Exams: ఈనెల 19 నుంచి టీసీసీ పరీక్షలు.. ఇవి తప్పనిసరి

బీఎస్సీ సైన్స్‌ కోర్సులోని విద్యార్థి బీఏలో ఉండే సైకాలజీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్‌ వంటి ఒక సబ్జెక్టును ఎంపికచేసుకోవడం బకెట్‌ సిస్టం ప్రత్యేకత. డిగ్రీలో అమ‌లు చేసిన బీఓసీ విధానంలో నాలుగు బకెట్స్ ఉంటాయి.. ఇందులో ఒక్కో బకెట్‌లో కొన్ని సబ్జెక్టుల‌ను కేటాయిస్తారు. విద్యార్థి రెండు కోర్సులకు సంబంధించిన మేజర్‌ సబ్జెక్టులను, ఇతర బకెట్‌లోని మరో సబ్జెక్టును ఎంపికచేసుకోవచ్చు.

బీఓసీ ర‌ద్దేనా...!!

డిగ్రీలో అమ‌లు చేసిన బీఓసీ విధానంపై, కోర్సుల్లో మార్పులు చేర్పులపై ఇటీవలే ఉన్నత విద్యామండలి, ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో బకెట్‌ సిస్టంతో వస్తున్న ఇబ్బందులను బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్ (బీవోఎస్‌) సభ్యులు ప్ర‌వేశ పెట్టారు. మ‌రీ ముఖ్యంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు డిమాండ్‌ అధికంగా ఉండగా, ఆర్ట్స్‌ కోర్సులకు అంతగా డిమాండ్‌ ఉండటంలేదు.

Inter Board Announcement : విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది ఇంట‌ర్ బోర్డు.. ఇక‌పై నో క‌న్ఫ్యూజ‌న్‌..!

సబ్జెక్టుల పునరావృతం సైతం బకెట్‌ సిస్టంపై వ్యతిరేకతకు కార‌ణంగా నిలుస్తుంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు బకెట్‌ సిస్టం రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అప్పుడే ఏ విష‌యంపై కూడా అంద‌రూ స్ప‌ష్ట‌త‌కు రావ‌ద్ద‌ని ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్కే మహమూద్ వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Feb 2025 12:36PM

Photo Stories