Inter Board Announcement : విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు.. ఇకపై నో కన్ఫ్యూజన్..!

సాక్షి ఎడ్యుకేషన్: వచ్చేనెల అంటే, మార్చి 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ప్రతీ ఏటా విడుదల చేసిన విధనంగా ఈసారి కూడా విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేస్తారు. కానీ, ఈసారి ఇందులో ఒక మార్పు ఉంటుందని, ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు ఇంటర్ బోర్డు అధికారులు..
ఒకే పేరుతో కన్ఫ్యూజన్..
సాధారణంగా బోర్డు పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ఒత్తిడికి గురవుతారు. అయితే, హాల్‌టికెట్లను పొంది తొలి పరీక్ష రాసేందుకు కేంద్రానికి చేరుకునేలోగా మరింత ఒత్తిడి ఎంతైనా ఉంటుంది. అందులోనూ, పలు కేంద్రాల పేర్లు ఒక్కటిగానే ఉంటాయి. వాటి కోడ్ మాత్రం వేర్వేగా ఉంటాయి. కాని, విద్యార్థుల్లో గందరగోళం మొదలవుతుంది. చాలామంది విద్యార్థులు కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నంలోనే లోనైపోతారు. వారి ఒత్తిడితో పరీక్షకు హాజరుకావడమే భయంగా ప్రారంభిస్తారు. ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి.
Inter Students : విద్యార్థులకు మరో అవకాశం.. విద్యాశాఖ కీలక నిర్ణయం..
క్యూఆర్ కోడ్..
ఇక విద్యార్థులు ఇలాంటి గందరగోళం, కంగారు వంటివాటికి లోనవకుండా ఉండేందుకు బోర్డు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే, హాల్‌టికెట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. అదే క్యూఆర్ కోడ్.. అంటే, క్విక్ రెస్పాన్స్. ఈ కోడ్‌ను విద్యార్థులు స్కాన్ చేస్తే చాలు ఆ కేంద్రం ఎక్కడుందో క్షణంలోనే తెలిసిపోతుంది. ఇక వారు వేర్వేరు చోట్లలో వెతకాల్సిన పని ఉండదు, చివరి నిమిషంలో కంగారు పడాల్సిన పని అంతకన్నా ఉండదు.
క్విక్ స్కాన్.. క్విక్ రీచ్..
మార్చిలో ప్రారంభమైయ్యే బోర్డు పరీక్షలకు విద్యార్థులు అందుకునే హాల్‌టికెట్లలో ఇకపై ఒక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేసిన తరువాత విద్యార్థులు ఒక్కసారి ఆ కేంద్రానికి ముందుగానే వెళ్లి పరీక్షించుకుని రావాలి. దీంతో, పరీక్ష కేంద్రం ఉన్న చోటు, అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి వాహనం సరిపోతుంది..? వెళ్లాల్సిన దారి, వంటి ముఖ్యవిషయాలపై స్పష్టత వస్తుంది.
Telangana Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. అత్యాధునిక సీసీటీవీ నిఘా
రూట్ అర్థం అవుతుంది కదా, అప్పడే చూస్తుందాం అనుకుంటే మాత్రం విద్యార్థులకు కంగారు తప్పదు. చివరి నిమిషంలో ఆందోళన పడే కన్నా, ముందుగానే పరిశీలించుకుంటే మంచిది. దీంతో, మీ సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది.
పూర్తి చిరునామా..
బోర్డు అందజేసే హాల్‌టికెట్లపై కేవలం 13 పదాల పరిమితి మాత్రమే ఉంటుంది. అందుకే ఇప్పటివరకు ఆ హాల్‌టికెట్లలో చిరునామను కేవలం 13 పదాల పరిమితోనే ప్రకటించారు. కాని, దీని వల్ల విద్యార్థుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంది. పరీక్ష కేంద్రాలు ఒకే పేరుతో ఉండగా మరింత కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో, కొందరు కేంద్రానికి సమయం మించిపోయిన తరువాత కూడా వచ్చేవారు ఉన్నారు.
అందుకే, ఈసారి ఈ విషయంలో కూడా బోర్డు స్పందిస్తూ.. ఆ 13 పదాల పరిమితిని తొలిగించినట్లు ప్రకటించింది. ఈసారి విద్యార్థులకు అందించే హాల్‌టికెట్లలో పరీక్ష కేంద్రానికి సంబంధించిన పూర్తి చిరునామాను పేర్కొనాలని స్పష్టం చేశారు. ఇక, విద్యార్థుల్లో కేంద్రానికి సంబంధించిన అయోమయం ఉండదు. కాకపోతే, విద్యార్థులు మాత్రం పరీక్షకు రెండు రోజులముందే పరీక్ష కేంద్రాన్ని ఒక సారి పరిశీలించుకోవాలి.. ఇది తప్పనిసరి అని బోర్డు సూచించింది.
ఐవీఆర్ నంబర్‌తో..
ఇంటర్ పరీక్షలకు ఈసారి హాల్‌టికెట్ల విషయంలో పలు మార్పులను ప్రకటించింది బోర్డు. అయితే, ఈసారి పద పరిమితిపై ఉన్న పరిమితిని తొలగించాము అంటూ.. మొత్తం చిరునామా హాల్ టిక్కెట్లపై ముద్రించబడుతుంది అని టీజీ బీఐఈ కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు.
Inter Board Exams Hall Tickets : ఇంటర్ విద్యార్థులకు బోర్డు అలర్ట్.. ఫోన్‌కే హాల్‌టికెట్లు..!!
ఇంకా ఈసారి హాల్ టిక్కెట్లు బోర్డుకు సంబంధించి, ఐబీఆర్ (IVR) నంబర్‌తో పాటు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ సంప్రదింపు వివరాలతో వస్తాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ నంబర్‌లను సంప్రదించాలని వివరించారు ఆయన.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Inter board 2025
- telangana inter board announcement
- qr code on hall tickets
- Telangana Inter Exams 2025
- IVR Code on Inter hall tickets
- Telangana Education Department
- changes in inter board hall tickets
- inter exam centers address clearance
- inter exam centers address clearance on hall tickets
- big announcement
- tsbie big annoucement for board exams 2025
- ts inter board exams 2025
- address clearance of exam center
- telangana inter board exams 2025 updates in telugu
- telangana inter board latest announcement
- Education News
- Sakshi Education News
- ExamHallTickets
- TelanganaBoardExams
- InterExamSchedule