PM Internship Applications : ఇంటర్నషిప్‌లో రెండో దశ ప్రక్రియ ప్రారంభం.. వీరికే అర్హత.. ఈ తేదీలోగానే..

సాక్షి ఎడ్యుకేషన్: పీఎం ఇంటర్న్‌షిప్ పథకం నుంచి విద్యార్థులకు, నిరుద్యోగులకు మరో శుభవార్త వచ్చింది. ఇప్పటికే తొలి దశలో భారీ సంఖ్యలో అభ్యర్థులు ఎంపికైయ్యాయి. ఇక ఇప్పుడు, రెండో దశ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా ప్రారంభం అయ్యింది. విద్యార్థులకు, నిరుద్యోగులకు దరఖాస్తులు, అర్హతలు వంటి వివరాలను, అర్హత, ఆసక్తి ఉన్న యువకులు ఈ కోర్సులో చేరాలని కోరారు తెలంగాణ పరిశ్రమల శాఖ సంచాలకులు డాక్టర్జి. మంగళవారం, ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా, పథకంలోని ముఖ్యంశాలను కూడా వివరించారు.
School Inspection : పాఠశాల తనిఖీలో కలెక్టర్.. తరగతి గదిలో టీచర్‌గా..
5000 మంజూరు..
పీఎం ఇంటర్నషిప్‌కు రెండో దశ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు, లేదా నిరుద్యోగులు వచ్చేనెల 11వ తేదీలోగా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అదే విధంగా, ఇంటర్నషిప్‌లో చేరినవారికి నెలవారి భత్యం కింద రూ. 5,000 మంజూరు చేస్తారు. ఇక, ఇందులో ఏడాది కాల వ్యవధిలో 6 నెలలపాటు ఉద్యోగానికి శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నవారికి, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు లభిస్తాయి. ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలు పెరిగితే, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతాయని తెలిపారు.
Admissions 2025 : పరీక్షలకు ముందే అడ్మిషన్లు షురూ.. ఆఫర్లంటూ ఫోన్ కాల్స్..
అర్హులు.. దరఖాస్తుల వివరాలు..
ఇక, అర్హత విషయానికి వస్తే.. అభ్యర్థులు ఖచ్చితంగా, పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీ వంటి విద్యలు పూర్తి చేసినవారు అర్హులని, నిరుద్యోగులైతే.. 21 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలని , అంతేకాకుండా, కుటుంబంలో ఎవ్వరు కూడా సర్కార్ ఉద్యోగి ఉండని వారు అయ్యిండాలని వివరించారు.
AP Intermediate public exams: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు.. రేపట్నుంచే హాల్‌టికెట్స్ రిలీజ్
ఇక, దరఖాస్తుల విషయానికొస్తే.. అధికారిక వెబ్‌సైట్.. pminternship.mca.gov.in పోర్టల్ సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకొని, దరఖాస్తులను కూడా వచ్చేనెల మార్చిలో 11వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఒకవేళ, వెబ్‌సైట్ కాకుండా, ఇతర మూలాలతో అంటే, వారు టోల్ ఫ్రీ నెంబర్1800116090 కు సంప్రదించి ఇతర విషయాలను తెలుసుకోవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- PM Internship Scheme
- job offers
- Unemployed Youth
- pm interships 2025
- second phase
- applications for pm internship scheme
- online applications
- internship and job offers
- education and profession
- second phase of pm internship scheme
- eligibilities for pm internship
- one year internship
- Graduates
- Education News
- Sakshi Education News
- InternshipOpportunities
- PMInternshipScheme