School Inspection : పాఠశాల తనిఖీలో కలెక్టర్.. తరగతి గదిలో టీచర్‌గా..

సాక్షి ఎడ్యుకేషన్: పాఠశాలలోని విద్యార్థులు ఎలా చదువుతున్నారు.. ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు ఎలా అనిపిస్తుంది.? విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి..? పాఠశాలలోని వసతులు ఎలా ఉన్నాయి. అలా, వివిధ విషయాలపై ఒక్కోసారి జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపడతారు. ఇందులో భాగంగానే, నిన్న, మంగళవారం.. ఫిబ్రవరి 18వ తేదీన గాంధారి మండలం పేట్‌సంగెం హైస్కూల్‌ను సందర్శించారు.. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
విద్యార్థులతో చర్చలు..
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసారు. అక్కడి వసతులు, విద్యార్థులకు అందుతున్న విద్య, భోజన, వసతులను తనిఖీ చేశారు. ఇక, పదో తరగతి విద్యార్థుల క్లాస్‌కు వెళ్లి ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ల్లోని పలు వివరాలను బోర్డుపై రాసి, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులతో చర్చలు జరిపారు. వారికి అందుతున్న విద్య, భోజనం, వసతులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.
Admissions 2025 : పరీక్షలకు ముందే అడ్మిషన్లు షురూ.. ఆఫర్లంటూ ఫోన్ కాల్స్..
స్టూడెంట్స్‌కు సూచన..
ఇక, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులను నిర్వహించాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. పదో తరగతి తర్వాత ట్రిపుల్ ఐటీలో చేరేలా చదువుకోవాలని స్టూడెంట్స్‌కు సూచించారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులను గర్వించే స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
AP Intermediate public exams: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు.. రేపట్నుంచే హాల్‌టికెట్స్ రిలీజ్
అనంతరం పేట్‌సంగెం రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్ నీళ్లు పోశారు. విద్యార్థులు నాణ్యమైన విద్యా, భోజనం అందించాలని అక్కడి ఉపాధ్యాయులని, అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, స్పెషల్ఆఫీసర్ లక్ష్మీప్రసన్న తదితరులు ఉన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- school inspection
- collector aasish sangwal
- Students
- School Students
- Special classes
- february 18th
- sudden inspection
- sudden school inspection
- collector visit to school
- Pettsangem High School
- Tenth Students
- lunch and education quality
- food and education inspection
- school students education
- Career Guidance
- special classes for students
- tenth students special classes
- Education News
- Sakshi Education News