Degree Supplementary Exams: రేపట్నుంచి డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు
Sakshi Education
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 6వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు డిగ్రీ 1, 2,3, 4,5,6 సెమిస్టర్ల స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Degree Supplementary Exams
కర్నూలు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల, నంద్యాల పీఎస్‌సీ అండ్ కేవీఎస్‌సీ డిగ్రీ కళాశాల, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం, పత్తికొండ, ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఎమ్మిగనూరు ఎస్‌ఎమ్‌ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.