Changes in BSc Syllabus : బీఎస్సీ సిలబస్‌లో మార్పులు.. ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..

సాక్షి ఎడ్యుకేషన్: డిగ్రీ కళాశాలలోని బీఎస్సీ కోర్సులో మార్పులు చేస్తున్నామంటూ ప్రకటన చేశారు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సెల్. రాష్ట్రంలోని వర్సిటీ పరిధిలో ఉన్న ప్రతీ కళాశాలలోని బీఎస్సీ కోర్సులో సిలబస్ మార్పులు చేయాలనే ఆదేశాలతో త్వరలోనే కీలక మార్పుల ప్రకటన ఇస్తామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలవుతుందని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్ తెలిపారు.
సీఎం ఆదేశం..
శనివారం, అంటే.. ఫిబ్రవరి 15వ తేదీన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో సబ్జెక్ట్ ఎక్స్ పర్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం, విద్యార్థుల్లో స్కిల్స్ పెరిగేలా, ఇతరులకు ఉపాధి కల్పించేలా సిలబస్ ను రూపొందించేందుకు యోచిస్తున్నారు అధికారులు.
విద్యార్థులకు విద్యతోపాటు ఉపాధి నైపుణ్యాలు, వివిధ రకాల స్కిల్స్ కూడా ఉండేలా కోర్సులోని సిలబస్ ఉండాలని పేర్కొన్నారు. ఇక దీనికి, అనుగుణంగా విద్యార్థులకు సిలబస్‌ను రూపోందిస్తున్నట్లు తెలిపారు విద్యా మండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్.
ఇకనుంచి 5 క్రెడిట్లు..
గతంలో సెమినార్లకు రెండు క్రెడిట్లు ఇస్తుండగా దాన్ని ఒక్క క్రెడిట్ కు పరిమితం చేశామని వెల్లడించారు. ప్రాజెక్ట్, ఇంటర్న్‌షిప్‌కు ఇస్తున్న 4 క్రెడిట్లకు బదులు 5 క్రెడిట్లను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. డిగ్రీకి గతంలో మాదిరిగానే 150 క్రెడిట్స్ విధానం కంటిన్యూ అవుతుందని వెల్లడించారు.
ఇక, డిగ్రీలో మరో విద్యాసంవత్సరం నుంచి చేరే విద్యార్థులకు సిలబస్‌లో మార్పులు ఉంటాయని, ప్రతీ ఒక్కరు ఆ సిలబస్‌తో నేర్చుకుని, ఉన్నత నైపుణ్యాలు పొందాలని, అంతేకాకుండా, నూతన సిలబస్‌తో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఈ సమావేశంలో హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వివరించారు. ఇక, ఈ సమావేశంలో కౌన్సిల్ సెక్రటరీ శ్రీరాంవెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- degree colleges
- bsc syllabus
- employment offers
- Degree Students
- Higher Education Council
- changes in bsc syllabus
- new academic year
- telangana cm revanth reddy
- Degree Education
- changes in bsc
- science syllabus in degree
- degree bsc syllabus changes for new academic year
- degree college students
- Subject Experts
- february 15th
- skills and employment development for students
- science students in degree
- science syllabus changes for degree students
- Education News
- Sakshi Education News
- universityupdates