Foods To Eat During Exams: పరీక్షల సమయంలో ఇవి తింటే ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది.. ఇలా డైట్ ప్లాన్ చేసుకుంటే..

● ఎక్కువ కారం, మసాలా, నూనెలతో తయారైన ఆహార పదార్థాలను తినకండి. వాటికి దూరంగా ఉండండి. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, రసంతో భోజనం మంచిది. పెరుగు, మజ్జిగ పరిమితంగా తీసుకోవాలి.
● అందుబాటులో ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. ద్రాక్ష, అరటి పండు, అనాస, దోస వంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది. పరీక్షలు జరిగే రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మంచి ఆహారంతో పరీక్షల గండం గట్టెక్కినట్లే.
Job Mela 2025: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. జాబ్‌మేళా ఎప్పుడు? ఎక్కడంటే..
● మెదడు తాజాగా ఉండాలంటే పరీక్షల సమయంలో విద్యార్థులు ఉదయం 4.30 గంటలకు లేవడం రాత్రి 10.30 గంటలకు ముందుగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
● మెదడు చురుగ్గా పని చేయడానికి ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిక్కుడు, కూరగాయలు, పండ్లు తినాలి. ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు వ్యాయామం చేస్తే మంచిది. తరువాత ఇడ్లీ, పాలు తీసుకోవడం ఉత్తమం. అనంతరం చదువు ప్రారంభించాలి.
Free Polycet Coaching: గుడ్‌న్యూస్.. ఉచితంగా పాలిసెట్ కోచింగ్, స్టడీ మెటీరియల్..
● పరీక్ష రాసి ఇంటికి వచ్చాక పండ్లు, పండ్ల రసాలు తాగాలి. పెరుగుతో ఆహారం తీసుకోవడం కూడా మంచిదే. సాయంత్రం చదువు ప్రారంభించేటప్పుడు కప్పు టీ తాగాలి. చదువడం అయిపోయాక నిద్రకు ఉపక్రమించే గంట ముందు తేలికపాటి భోజనం తీసుకోవాలి.
రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర పోవడం మంచిది.
● ఒత్తిళ్లకు గురికాకుండా నిద్ర పోవాలి. రోజులో ఎక్కువ సార్లు పాలు తాగండి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఒకసారి రాస్తూ చదివితే పదిసార్లు చదివినట్లు అర్థం.
-డాక్టర్ కొత్తపల్లి నరేష్, యర్రగుంటపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి