Skip to main content

PM Internship Scheme Applications : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. టాప్‌ 500 కంపెనీలు, ప్రతినెలా స్టైఫండ్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : పీఎం ఇంటర్నెషిప్ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో... 12 నెలల శిక్షణ పాటు.. శిక్షణ సమయంలో నెలకు రూ.6000 స్టైఫండ్ ఇస్తారు. అలాగే ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. పదో తరగతి, ఇంటర్మిడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ అవకాశాన్ని కల్పిస్తారు. 
PM Internship Scheme Applications
PM Internship Scheme Applications

ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024

ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు:

వ్యవధి: 12 నెలలు, భారతదేశంలోని టాప్ కంపెనీలలో వాస్తవ అనుభవం పొందే అవకాశం.

టాప్ కంపెనీలు: భారతదేశంలోని ప్రతిష్టాత్మక 500 టాప్ కంపెనీలలో పరిశ్రమ నాయకులతో నెట్‌వర్క్ మరియు నేర్చుకోవడం.

ఆర్థిక సహాయం: ఇంటర్న్‌లు భారత ప్రభుత్వ నుండి నెలకు ₹4500 మరియు పరిశ్రమ నుండి ₹500 స్టైపెండ్ పొందుతారు. అదనంగా, అనుకోని ఖర్చుల కోసం ₹6000 ఒకసారి గ్రాంట్ అందించబడుతుంది.

Application Process for Internship    PM intership scheme applications for second phase   PM Internship Scheme Announcement

ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ అర్హత ప్రమాణాలు:

  • 21 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన, ప్రస్తుతం పూర్తి సమయం ఉద్యోగం చేయని అభ్యర్థులు.
  • 10వ తరగతి ఉత్తీర్ణులైన లేదా అధిక అర్హత కలిగిన అభ్యర్థులు.
  • 2023-24లో ₹8 లక్షల లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందిన వ్యక్తి ఉన్న కుటుంబం నుండి ఎవరైనా అర్హులు కాదు.
  • కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న సభ్యుడు ఉండకూడదు.

ఎలా దరఖాస్తు చేయాలి? అర్హత కలిగిన అభ్యర్థులు pminternship.mca.gov.in లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 11వ తేదీలోగా 
మరిన్ని వివరాలకు: టోల్​ ఫ్రీ నెంబర్​1800116090 ను సంప్రదించండి. 

PMIS is a boon for unemployed youth

రెండో దశకు దరఖాస్తులు షురూ..
⇒ పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ రెండో దశ దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో 1,26,557 అవకాశాలు 
అందుబాటులో ఉంచారు. వీటిలో ఆంధ్రపదేశ్‌కు 4,715; తెలంగాణకు 5,357 కేటాయించారు. అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తమ అర్హతలు, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి.

⇒ఈ స్కీమ్‌లో అర్హతల వారీగా అవకాశాల సంఖ్యను సైతం పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారికి 36,901, టెన్త్‌ చదివిన వారికి 24,696, ఐటీఐ ఉత్తీర్ణులకు 23,269, డిప్లొమా ఉత్తీర్ణులకు 18,589; ఇంటర్మిడియెట్‌ / 12వ తరగతి ఉత్తీర్ణులకు 15,412 అవకాశాలను అందుబాటులో పెట్టారు. రెండో దశలో అభ్యర్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి.  
 

విస్తృతం చేయాలి.. 
పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ను టాప్‌–500 సంస్థలకేకాకుండా ఇతర సంస్థలకు కూడా విస్తరింపజేయాలి. దీనివల్ల ఔ త్సాహికులు తమ సమీప ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం మెరుగవుతుంది. సుదూర ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్‌ ట్రైనీగా అవకాశం లభించినా.. నివాస ఖర్చులు, ఇతర కోణాల్లో ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు కూడా వ్యక్తిగత హద్దులు ఏర్పరచుకుని మెలగడం కూడా సరికాదని, అవకాశమున్న చోటికి వెళ్లాలని గుర్తించాలి.     
– టి.మురళీధరన్, టీఎంఐ నెట్‌వర్క్‌ చైర్మన్‌

Published date : 25 Feb 2025 03:53PM

Photo Stories