Skip to main content

PM Internship Scheme 2025 : పీఎం ఇంట‌ర్నషిప్ స్కీమ్‌.. 300కుపైగా కంపెనీలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ!!

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది కేంద్ర స‌ర్కార్‌.. పీఎం ఇంట‌ర్న‌షిప్‌కు సంబంధించి రెండో ద‌శ ద‌రఖాస్తులు ప్రారంభంమైయ్యాయి.
Applications and eligibilities for pm internship scheme 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది కేంద్ర స‌ర్కార్‌.. పీఎం ఇంట‌ర్న‌షిప్‌కు సంబంధించి రెండో ద‌శ ద‌రఖాస్తులు ప్రారంభంమైయ్యాయి. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఇంటర్న్‌షిప్‌ కింద ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది. అర్హ‌త‌, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఇంట‌ర్న‌షిప్‌లో దాదాపు 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని అనేక మంది యువ‌త త‌మ ఉపాధి జీవితాన్ని ప్రారంభించ‌వ‌చ్చు.

CUET PG 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డు విడుదల ఎప్పుడో తెలుసా!

ద‌ర‌ఖాస్తులు.. ఇంట‌ర్న‌షిప్..

ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఈనెల 12వ తేదీన ముగియ‌నుంది. ఈ ఇంట‌ర్న‌షిప్‌లో శిక్ష‌ణ అభ్య‌ర్థుల‌కు ఏడాదికాలం ఉంటుంది. ఇందులో మొత్తం, 300కు పైగా కంపెనీలు ఉంటాయి. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. దీనితోపాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్‌) కూడా చెల్లిస్తారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్‌ రూంలో.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఉంటుంది.

అర్హ‌త‌లు..

అభ్య‌ర్థులు 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతీ యువకులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దూరవిద్యతో పాటు పదో తరగతి పాసైన అభ్యర్థులు కూడా అర్హులే. టెన్త్‌తోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కుటుంబాలకు చెందినవారు, ఏడాదికి రూ. 8 లక్షల ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు అనర్హులు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు కూడా అనర్హులే.

NEET UG 2025 దరఖాస్తు చేసారా? రేపే చివరి తేదీ!

ప్ర‌యోజ‌నాలు..

పీఎం ఇంటర్న్‌షిప్‌లో అభ్య‌ర్థుల‌కు వ్యక్తిగత బీమా వ‌స‌తి ఉంటుంది. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పించే ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ప్రీమియం కూడా స‌ర్కారే చెల్లిస్తుంది. 

ఇక‌, ఈ ఇంట‌ర్న‌షిప్‌కు ఆసక్తి కలిగిన వారు, త‌గిన అర్హ‌త ఉన్న‌వారు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎంఐఎస్) 2025 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మ‌రిన్ని వివరాల‌కు, లేదా సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సంద‌ర్శిస్తూ ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Mar 2025 05:03PM

Photo Stories