Skip to main content

Schools and colleges Holidays: ఈ నెల 26, 27వ తేదీన స్కూళ్లకు కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు

Schools and colleges Holidays  Maha Shivaratri 2025 holiday announcement   MLC elections school and college holiday notice Public holiday notice for Maha Shivaratri 2025  Schools and colleges closed for Maha Shivaratri and MLC elections
Schools and colleges Holidays

ఈ నెల 26, 27 తేదీన స్కూళ్లకు కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి ఫిబ్రవరి 26న మహా శివరాత్రి 2025 (Maha Shivaratri 2025) సందర్భంగా సెలవు (public holiday) రానుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం (Telangna Government) ప్రకటించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వార్షిక సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇండియన్ ఆర్మీలో మహిళలకు ఉద్యోగాలు జీతం నెలకు 56,100: Click Here

దీంతోపాటు మరుసటి రోజు 27వ తేదీ కూడా సెలవు రానుంది. దీంతో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవు రానుంది. దీంతో విద్యార్థులకు మరోసారి ఎగిరిగంతేసే వార్త ఇది.  

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు రానుంది. దీంతోపాటు గుంటూరు, కృష్ణ జిల్లాల్లో కూడా సెలవు రానుంది. 

అదేవిధంగా మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంగనర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఫిబ్రవరి 27వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ సీట్‌, గ్రాడ్యూయేట్‌ ఎన్నికల నేపథయంలో ఈ సెలవు రానుంది.  

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నామినేషన్‌ స్వీకరణ మొదలైంది. 10వ తేదీ వరకు జరుగుతుంది. 13వ తేదీ వరకు నామినేషన్‌ వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి మరుసటి రోజు 27వ తేదీ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.  

తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్‌లో 2 గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ జిల్లాల్లోని టీచర్లు ఓటు వేయనున్న నేపథ్యంలో ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు రానుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

Published date : 18 Feb 2025 08:36AM

Photo Stories