Skip to main content

Indian Army women jobs: ఇండియన్ ఆర్మీలో మహిళలకు ఉద్యోగాలు జీతం నెలకు 56,100

Indian Army women jobs   Indian Army NCC Special Entry 58th Course 2025 notification   Apply online for Indian Army NCC Special Entry Scheme 2025
Indian Army women jobs

ఇండియన్ ఆర్మీ – ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు దరఖాస్తు వివరాలు
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ కోర్సు (అక్టోబర్ 2025) ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు 2025 మార్చి 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ నెల 18న స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు బంద్‌..?: Click Here

ఖాళీల వివరాలు
కేటగిరీ వారీగా పోస్టులు:

ఎన్‌సీసీ పురుషులు: 70 పోస్టులు
ఎన్‌సీసీ మహిళలు: 06 పోస్టులు

యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేకంగా 8 పోస్టులు అందుబాటులో ఉంటాయి.

అర్హతలు:
కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారికి కూడా దరఖాస్తు అవకాశం.
మూడేళ్లు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో కొనసాగి ఉండాలి.
ఎన్‌సీసీ 'C' సర్టిఫికెట్‌లో కనీసం 'B' గ్రేడ్ పొందాలి.
యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ 'C' సర్టిఫికెట్ అవసరం లేదు.

వయోపరిమితి: 2025 జూలై 1 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:
అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్
స్టేజ్-1 & స్టేజ్-2 టెస్టులు

ఇంటర్వ్యూ:
మెడికల్ ఎగ్జామినేషన్
ధ్రువపత్రాల పరిశీలన

శిక్షణ & వేతనాలు:
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీలో (OTA) 49 వారాల శిక్షణ.
శిక్షణ కాలంలో నెలకు ₹56,100 స్టైపెండ్.
శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మద్రాస్ యూనివర్సిటీ ద్వారా "పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ & స్ట్రాటజిక్ స్టడీస్" డిగ్రీ.
శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి నియామకం.

దరఖాస్తు చివరి తేదీ: 15-03-2025

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: www.joinindianarmy.nic.in
 

Published date : 17 Feb 2025 09:00AM

Photo Stories