Skip to main content

Schools and colleges Holidays: ఈ నెల 26, 27వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజులు సెలవులు

ఫిబ్రవరి నెలలో ఏదో ఒక కారణంతో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి వరుసగా ఈ నెల 26, 27 తేదీన రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు, ఉద్యోగులకు సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా సెలవు (public holiday) రానుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
Schools and colleges Holidays  Government declares Maha Shivaratri as a public holiday
Schools and colleges Holidays

ఇక తెలంగాణలోనూ ఇటీవల  ప్రభుత్వం మహా శివరాత్రి సందర్భంగా పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఏపీలోనూ మహా శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌, ఆఫీసులు సెల‌వు ఇచ్చారు. అలాగే ఆ మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన‌ ఏపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఇలా వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు వచ్చాయి. 

School Holidays: ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్‌!.. కార‌ణం ఇదే.. | Sakshi  Education

27న ప్రత్యేక సెలవు

ఏలూరు(మెట్రో): తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

27న సాధారణ సెలవు

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్‌ అధికారి, డీఆర్‌ఓ షేక్‌.ఖాజావలి మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతివ్వాలని సూచించారు.

School holidays School holidays In Vizag due to PM Modi Tour

ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
ఫిబ్రవరి 2025  :
➤☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి 

➤☛ ఎమ్మెల్సీ ఎన్నికలు – 27 ఫిబ్రవరి 

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 19 Feb 2025 03:21PM

Photo Stories