Schools and Colleges Holiday : నేడు విద్యాసంస్థలకు సెలవు.. ఈ జిల్లాలోనే.. కారణం!!

సాక్షి ఎడ్యుకేషన్: సెలవులంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి.. విద్యార్థులకు సెలవులు ఉన్నాయి అంటే చాలు, ఎన్ని రోజులు అనే విషయంతో చాలామందికి పని ఉండదు. అయితే, తాజాగా మరోసారి ఈ శుభవార్త వచ్చింది విద్యార్థులకు. కాని, ఈ సెలవు ప్రతీ పాఠశాల విద్యార్థులకు కాదు. మరి ఎవరికీ..!
తెలంగాణలోని సూర్యపేటలో నేడు ఓ జాతర జరుగుతుంది. ప్రతీ ఏటా జరిగే శ్రీ లింగమంతుల స్వామి జాతర ఈ జిల్లాలో చాలా పేరొందింది. దీంతో, ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. సూర్యపేట జిల్లాలోని పాఠశాల, కళశాల విద్యార్థులకు నేడు అధికారికంగా సెలవు ప్రకటించారు.
మేడారం తరువాత..
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీలింగమంతుల స్వామి ఆలయం ఒకటి. ప్రతిఏటా వైభవంగా స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. అంతేకాకుండా, మేడారం తర్వాత జరిగే అతిపెద్ద జాతరగా దీనికి పేరుంది. ఈ జాతరకు ఈసారి 20 నుంచి 30 లక్షల మంది వస్తారని తెలుస్తోంది.
Gurukul School Admissions : గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులు.. ఇదే చివరి తేది
ప్రతీ ఏటా నిర్వహించే ఈ జాతరకు వేలు కాదు, ఏకంగా లక్షల మంది భక్తులు వస్తుంటారంట. ఇంత పేరొందిన ఈ జాతర సమయంలో ఆ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు. కాని, కేవలం సోమవారం మాత్రమే సెలవు మంగళవారం మాత్రం యథావిధిగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై, విద్యాబోధన జరుగుతుంది.
5 రోజులపాటు..
తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. ఈ జాతర మొత్తం 5 రోజులు జరుగుతుంది. ఇది సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత అతి పెద్దది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతులస్వామి ఆలయం ఉంది. ఈ జాతర దాదాపు 250 యేళ్ల నుంచి జరుగుతున్నట్లు తెలుస్తుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Schools Holidays
- education institutions holidays
- suryapet district schools
- district schools and colleges
- Telangana Government
- Good News For Students
- jaatara holidays
- Peddagattu Jaatara
- Suryapet District
- suryapet district education institutions holiday
- monday holiday news
- february 17th holiday news
- today holiday
- schools and colleges holiday news in telugu
- schools and colleges holiday today
- today holiday for schools and colleges news in telugu
- suryapet district schools and colleges holiday news on feb 17th
- Education News
- Sakshi Education News