Skip to main content

AP TET 2024 Result Release Date : ఏపీ టెట్‌-2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) 2024 ప‌రీక్ష‌లు అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు. అలాగే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రిలిమినరీ కీ ని కూడా విద్యాశాఖ విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
ap tet 2024 result release date

అలాగే అక్టోబర్ 27వ తేదీన‌ ఫైనల్‌ ‘కీ’ విడుదల చేయ‌నున్నారు. అయితే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను కూడా విడుద‌ల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్ల‌ను చేశారు. 

ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..
నవంబర్‌ 2వ తేదీన ఏపీ టెట్‌-2024 ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు. ఏపీ టెట్‌-2024 పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఏపీ టెట్ ఫ‌లితాల‌ను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ టెట్ 2024 ఫలితాలు విడుదలైన మరుసరటి రోజే మెగా డిఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయ‌నున్నారు.

AP DSC నోటిఫికేష‌న్ -2024 ఎప్పుడంటే...
ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఏపీలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. 

Published date : 22 Oct 2024 08:12AM

Photo Stories