Skip to main content

TG TET 2024 Lessons: టీ–శాట్‌లో టెట్‌ పాఠాలు.. యూ ట్యూబ్‌లో కూడా..

సాక్షి, హైదరాబాద్‌: టెట్‌– 2024 పరీక్ష సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్పెషల్‌ డిజిటల్‌ కంటెంట్‌ అందించేందుకు ప్రత్యేక ప్రసారాలు ప్రారంభించినట్లు టీ–శాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
Tet lessons in TSAT

టీజీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు కంటెంట్‌ అందిస్తున్న విధంగానే టెడ్‌ కంటెంట్‌ అందిస్తున్నట్లు న‌వంబ‌ర్‌ 17న ఒక ప్రకటనలో వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

చదవండి: TET 2025 Information Bulletin: టెట్‌ బులెటిన్‌ విడుదల రేపు.. దరఖాస్తు, పరీక్షల‌ తేదీలు ఇవే..

ఈ పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం 50 రోజుల పాటు 200 ఎపిసోడ్స్‌ ప్రసారం చేయనున్నట్లు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. టీ– శాట్‌ నిపుణ ఛానల్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, విద్య ఛానల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలవరకు రోజూ 4 గంటలపాటు ప్రత్యేక ప్రసారాలుంటాయన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

జనరల్‌ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈవీఎస్, మ్యాథ్స్‌ తో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్‌ పాఠాలు ప్రసారమవుతాయని వివరించారు. టెట్‌ పేపర్‌–1, 2కు హాజరయ్యే అభ్యర్థులు టీ– శాట్‌ ప్రసారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెట్‌ పాఠాలు టీ–శాట్‌ యాప్, యూ ట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.

Published date : 18 Nov 2024 02:14PM

Photo Stories