Skip to main content

PG Medical Admissions: ఏం చేద్దాం?.. హైకోర్టు తీర్పుతో కౌన్సెలింగ్‌పై సర్కార్‌ సమాలోచనలు.. అస‌లు వివాదం ఇదీ..

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ సీట్ల భర్తీలో స్థానికతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేప థ్యంలో ప్రభుత్వం భవిష్యత్‌ కార్యాచరణపై ఉన్నత స్థాయిలో సమీక్షిస్తోంది. తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశా నికి ప్రభుత్వం నిర్ణయించిన ‘స్థానికత’ జీవోలు 148, 149 లను హైకోర్టు మంగళవారం కొట్టివేయటంతో కౌన్సెలింగ్‌ లో ఎలాంటి విధానాలను అవలంభించాలనే అంశంపై దృష్టి సారించింది. కోర్టు కేసు కారణంగా ఇప్పటికే మొదటి సంవత్సరం పీజీ కౌన్సెలింగ్‌ ఆలస్యమైంది. ప్రభుత్వానికి అను కూలంగా తీర్పు వస్తే వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని భావించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యా లయం.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. హైకోర్టు ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒకటి రెండు రోజుల్లో పీజీ కౌన్సెలింగ్‌పై విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Telangana NEET PG Counselling 2024

‘స్థానిక’ వివాదంతో నిలిచిన ప్రవేశాలు

గత అక్టోబర్‌ నెలాఖరున 2024–25 సంవత్సరానికి కన్వీనర్‌ కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

నీట్‌ పీజీ–2024లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. వెంటనే కౌన్సెలింగ్‌ ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ’స్థానికత’ నిబంధనపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

చదవండి: Good News for PG Medical Students: తెలంగాణలో MBBS చేస్తే.. పీజీలో ‘స్థానికులే’.. ఇతర రాష్ట్రాల్లో మెడిసిన్ ​చదివిన వారు మాత్రం ఇలా..

ఈ జాప్యం ఇప్పటికే పీజీ మెడికల్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిన పీజీ విద్యార్థులకు సైతం ఇబ్బందిగా మారింది. ఈ విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది అడ్మిషన్లు పూర్తయితే తప్ప.. ఇప్పటికే మొదటి సంవత్సరం పూర్తయినవారు అక్కడి నుంచి రిలీవ్‌ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.

వివాదం ఇదీ..

  • తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు సైతం ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ పూర్తి చేస్తే.. వారు తెలంగాణలో పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతారని ప్రభుత్వం జారీచేసిన 148, 149 జీవోల్లో స్పష్టం చేయడంతో వివాదం మొదలైంది. 
  • అలాగే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ మెడికల్‌ నోటిఫికేషన్‌ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్‌ కూడా ఇక్కడే చదివి ఉండాలి. 
  • విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో చదివిన తెలంగాణ విద్యార్థులు కూడా స్థానికులేనని కాళోజీ వర్సిటీ ప్రకటించింది. 
  • ఈ ఉత్తర్వుల వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారు అటు ఏపీలో, ఇటు తెలంగాణలోనూ స్థానికులు కాకుండా పోతున్నారనే ఆందోళన వ్యక్తమైంది. 
  • నీట్‌ పరీక్ష కారణంగా తెలంగాణకు చెందిన టాప్‌ ర్యాంకర్లు ఎక్కువగా జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. వారు ఈ జీవోల వల్ల రాష్ట్రంలో పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతున్నారు. 
  • ఇంటర్మీడియేట్‌ వరకు ఇతర రాష్ట్రాల్లో చదివి, ఎంబీబీఎస్‌ తెలంగాణలో చదివినప్పటికీ జీవో 148, 149 వల్ల స్థానికేతరులే అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ చదివినా.. తెలంగాణ స్థానికత లేకుండా ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్‌ చదివినా కూడా స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Dec 2024 03:01PM

Photo Stories