Skip to main content

10956 VRO Jobs news: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ ఇంటర్ అర్హతతో 10,956 VRO ఉద్యోగాలు జీతం నెలకు 45000

VRO jobs
VRO jobs

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (VRO) ఉద్యోగాల భర్తీకి కొత్త చట్టాలు, రూల్స్‌ను ప్రవేశపెట్టింది. 10,956 రెవిన్యూ గ్రామాలలో ఈ పోస్టులను సంక్రాంతి నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పాఠశాలలకు, కాలేజీలకు, బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు ప్రకటన: Click Here

ప్రభుత్వ భూముల రక్షణ, రెవిన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు, గ్రామాల్లో ప్రభుత్వానికి సమన్వయాన్ని పెంచేందుకు ఈ కొత్త నియామకాలు అవసరమని ప్రభుత్వం పేర్కొంది.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఈ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ లోని విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (VRO) పోస్టులుగా ఉంటాయి.

ఎంపిక చేసే సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)

ఉద్యోగాల వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య: 10,956

భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య: 10,956 (8,000 మిగతా పోస్టుల భర్తీ గత VROలతో)

ప్రాథమిక అర్హత: ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు: 18 నుండి 46 సంవత్సరాల మధ్య

వయో సడలింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, Ex-సర్వీస్ మాన్ వారికి వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

కావాల్సిన పత్రాలు:
పదవ తరగతి, ఇంటర్మీడియట్/డిగ్రీ సర్టిఫికెట్‌లు
కుల ధ్రువీకరణ పత్రం
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
సిగ్నేచర్

జీతం: నెలకు రూ.45,000/- వరకు జీతం

ఎంపిక విధానం:
గత VROలతో కొంత భాగం భర్తీ చేస్తారు.
మిగతా 8,000 పోస్టుల భర్తీ కోసం వ్రాత పరీక్ష నిర్వహించనున్నారు.
మేరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
సంక్రాంతి లోపుగా నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ROR చట్టం - ముఖ్యాంశాలు: తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాసుబుక్ చట్టం 2024 ద్వారా, తెలంగాణలో భూమి సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు 12,000 VRO పోస్టుల భర్తీ చేయబడనుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
 

Published date : 19 Dec 2024 09:06PM

Tags

Photo Stories