Pariksha Pe Charcha PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా? ఇలా చేయండి..
పరీక్షాపే చర్చ.. ముఖ్య ఉద్దేశం ఇదే
దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడతారు. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం వంటి పలు సూచనలు సైతం అందజేస్తారు. 2025 సంవత్సరానికి కూడా ‘పరీక్షా పే చర్చా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ https://innovateindia.mygov.in/ లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఇదే
జనవరి 14 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి గడువు ఉంది. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తాము ఏయే ప్రశ్నలు అడగదలచుకున్నారో.. 500 అక్షరాలకు మించకుండా ముందే చెప్పాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ‘పరీక్షాపే చర్చ’లో పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్‌లైన్‌లో పంపొచ్చు.
విజేతలుగా నిలిస్తే...
‘పరీక్షాపే చర్చ’ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం ఉంటుంది. ‘పరీక్షాపే చర్చ’లో ఎంపికై న సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రు లకు విద్యా మంత్రిత్వ శాఖ పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్‌ను పొందే అవకాశం ఉంది.
ఎలా లాగిన్ అవ్వాలి?
- ముందుగా htpps://innovateindia.mygov.in/ లింక్‌ను క్లిక్ చేయాలి.
- మీ మొభైల్ నెంబర్ లేదా జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి
- మీ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయండి
- మీ థీమ్ లేదా ప్రశ్న వివరాలను ముందే వివరించాల్సి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Pariksha Pe Charcha
- Central Education Department
- Narendra Modi
- Prime Minister Narendra Modi
- PM Narendra Modi
- pm modi pariksha pe charcha 2025
- pm modi pariksha pe charcha 2025 instructions
- pariksha pe charcha 2025 live updates
- pariksha pe charcha 2025 news
- PM Modi
- PM Modi Interacts with Students and Teachers
- Pariksha Pe Charcha 2025
- Pariksha Pe Charcha 2025 Updates
- RegistrationForParikshaPeCharcha
- UnionEducationMinistry
- ExamPreparationTips
- PMModiExamTips