Hyderabad Book Fair : నేటి నుంచే బుక్ ఫెయిర్ ప్రారంభం.. ఎన్ని రోజులంటే..!
సాక్షి ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభం కానుందని, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, బుక్ ఫెయిర్‌లో సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించనున్నామని తెలిపారు.
బుక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బుక్ ఫెయిర్.. ఒకటి, రెండు కాదు ఏకంగా 11 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఫెయిర్‌లో పాల్గొనవచ్చన్నారు. ఈ ఏడాది తొలిసారిగా రెండు స్టేజీలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు యాకూబ్ షేక్.
ప్రత్యేక స్టాళ్లు..
పదకొండు (11) రోజులపాటు సాగే ఈ బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి-ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయ భారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌గా నామకరణం చేశారు. బుక్ ఫెయిర్ సందర్భంగా తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
National Award: తెలంగాణ పోలీసులకు జాతీయ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు
పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సహా వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. పుస్తకాలపై కనీసం పది శాతం తగ్గింపును అందిస్తున్నామని హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- book fair
- Hyderabad
- book favorites
- telangana cm revanth reddy
- Hyderabad Book Fair
- HBF President Dr. Yaqoob Sheikh
- 37th book fair in hyderabad
- 11 days
- authors and writers
- book authors
- men and women authors
- various books
- story books
- food stalls in book fair
- kids special stalls
- telangana food items
- Famous critic Boi Vijaya Bharathi
- Poet Dasarathi Krishnamacharya
- poets and writers
- Authors
- student authors
- story and poem books
- language books
- Education News
- Sakshi Education News
- 37thHyderabadBookFair
- BookFairin 2024
- BookLoversinHyderabad
- TelanganaBookFair
- HyderabadBookFair