Skip to main content

TG TET 2025: టెట్‌ ఫీజు తగ్గింపు.. వీరికి మాత్రం ఫీజు మినహాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్‌–1 లేదా పేపర్‌–2 పరీక్ష రాసేందుకు రూ. వెయ్యిగా ఉన్న ఫీజును రూ. 750కి తగ్గించింది.
TS TET 2025 Application Start and Fee Reduction news in telugu

పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు రాసే అభ్యర్థులకు గతంలో రూ. 2 వేలుగా ఉన్న ఫీజును రూ. తాజాగా వెయ్యికి తగ్గించింది. అలాగే టెట్‌ రాసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు టెట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ న‌వంబ‌ర్‌ 7న అర్ధరాత్రి విడుదల చేసింది.

చదవండి: TG TET 2025 Notification: టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..

దీంతోపాటు సమగ్ర సమాచార బులెటిన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. టెట్‌ పేపర్‌లో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వాటికి 150 మార్కులుంటాయి. చైల్డ్‌ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు ఇతర రిజర్వేషన్‌ కేటగిరీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు.

చదవండి: TG టెట్‌ హోమ్ - TG డీఎస్సీ | సిలబస్ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | TG TET ప్రివియస్‌ పేపర్స్

టెట్‌ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుంది. హాల్‌టికెట్లను డిసెంబర్‌ 27 నుంచి 2025 జనవరి 20 మధ్య డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇది న‌వంబ‌ర్‌ 20వ వరకు కొనసాగుతుంది. టెట్‌ అర్హత సర్టిఫికెట్‌ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకంలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

Published date : 08 Nov 2024 12:41PM

Photo Stories