Skip to main content

TG TET 2025 Notification: టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది.
TS TET January 2025 notification released news in telugu   Sakshi, Hyderabad: Teacher Eligibility Test (TG TET) 2025 will be held from 1st to 20th January. Telangana Director of School Education EV Narsimha Reddy has released a notification regarding this on 4th November. You can apply online from November 5 to 20. This is the second time that Tet notification has been given this year  Telangana Teacher Eligibility Test Dates  Online Application Period for TG TET

తెలంగాణ‌ పాఠశాల విద్య డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి న‌వంబ‌ర్‌ 4న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. న‌వంబ‌ర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ఇది రెండోసారి.

జాబ్‌ క్యాలెండర్‌లో ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌ 2 వరకూ టెట్‌ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.

చదవండి: Again TS TET 2024 Notification Release : మ‌రో సారి.. టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఇంకా డీఎస్సీ కూడా....?

వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్‌ రాసే అవకాశం కల్పించారు.

తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్‌ న‌వంబ‌ర్‌ 5న  https://schooledu.telangana.gov.in  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం, టెట్‌ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. 

చదవండి: టెట్‌ - డీఎస్సీ | సిలబస్ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్‌ పేపర్స్ | TS TET ప్రివియస్‌ పేపర్స్

పేపర్‌–2లో తక్కువ ఉత్తీర్ణత 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి టెట్‌ నిర్వహిస్తున్నారు. డీఈడీ అర్హత గల వారు పేపర్‌–1, బీఈడీ అర్హులు పేపర్‌–2తో పాటు పేపర్‌–1 రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. పేపర్‌–1 ఉత్తీర్ణులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే అర్హత సాధిస్తారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పేపర్‌–2 అర్హులు ఉన్నత పాఠశాలల వరకూ బోధించే వీలుంది. అయితే పేపర్‌–2లో ఉత్తీర్ణులు గత 8 ఏళ్ళుగా తక్కువగా ఉంటున్నారు. గరిష్టంగా 30 శాతం దాటకపోవడం, జనరల్‌ కేటగిరీలో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటం కని్పస్తోంది. ఇందుకు బీఈడీలో నాణ్యత లోపమే కారణమనే విమర్శలున్నాయి. 

Published date : 05 Nov 2024 12:31PM

Photo Stories