Skip to main content

DSC 2008 Candidates: వెరిఫికేషన్‌ పూర్తయినా నియామకాల్లేవు!

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): తమకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయ్యి 50 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వడం లేదని డీఎస్సీ–2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
డీఎస్సీ అభ్యర్థుల సమస్యపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్న చిన్నారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 200 మందికి పైగా అభ్యర్థులు న‌వంబ‌ర్‌ 19న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు తరలివచ్చారు.

15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు కూడా అవకాశం ఇచ్చిందని వారు తెలిపారు.

చదవండి: DSC 2024 Selected Candidates: కొత్త టీచర్లలో గుబులు!.. ధ్రువీకరణపత్రాల పునఃపరిశీలన..

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,400 మంది అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకున్నట్టు వెల్లడించారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నామని, అయితే 50 రోజులు గడుస్తున్నా తదుపరి ప్రక్రియపై ముందడుగు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇచ్చి, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అభ్యర్థులతో చిన్నారెడ్డి చర్చలు 

ప్రజాభవన్‌లో న్యాయం కోరుతూ బైఠాయించిన డీఎస్సీ–2008 అభ్యర్థులతో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి చర్చలు జరిపారు. విద్యాశాఖ కమిషనర్‌ నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

అభ్యర్థుల జాబితా రూపకల్పన ప్రక్రియ చివరి దశలో ఉందని, రెండు మూడురోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్సీ–2008 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ నాయక్, కార్యదర్శి మెరుగు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Published date : 20 Nov 2024 11:59AM

Photo Stories