Ragging Incident: ర్యాగింగ్ ఘటనలో నలుగురిపై వేటు.. ర్యాగింగ్ నిరోధక కమిటీ ఉత్తర్వులు జారీ..
Sakshi Education
నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కేరళ రాష్ట్రానికి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనకు సంబంధించి ఒక జూనియర్ డాక్టర్, మరో ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.
ఇందులో జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలపాటు, 2020 బ్యాచ్‌కి చెందిన మెడికోను ఆరు నెలలు, మొదటి సంవత్సరం విద్యార్థిని నెల రోజులపాటు, అలాగే 2023 బ్యాచ్‌కు చెందిన మరో మెడికోను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ర్యాగింగ్ నిరోధక కమిటీ చైర్మన్, ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీచేశారు.
చదవండి: Side Effect of Medicines: దుష్ప్రభావాలు రాయడం కుదరదు: సుప్రీంకోర్టు
ఉత్తర్వు కాపీలను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయానికి పంపించారు. కాగా, కేరళ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడిన జూనియర్ డాక్టర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులపై ర్యాగింగ్ నిరోధక కమిటీ నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Published date : 19 Nov 2024 03:48PM