TG DSC 2024: పోస్టింగ్ లేదంటున్నారు.. డీఎస్సీ 2024లో అనేక లోపాలు
జిల్లా విద్యాశాఖ ఆగమేఘాల మీద ఎంపిక ప్రక్రియ చేపట్టింది. 640 పోస్టులకు గాను 452 మందిని ఎంపిక చేశారు. మిగతా పోస్టులలో వివిధ కారణాలు చూపెడుతూ భర్తీ చేయలేదు.
అనంతరం అభ్యర్థుల ఫిర్యాదుల మేరకు పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ ఘటనలో అనేక లోపాలు చోటుచేసుకుంటున్నాయి.
చదవండి: DSC Free Training : వాయిదా పడ్డ డీఎస్సీ ఉచిత శిక్షణ ఎంపిక ప్రక్రియ.. కారణం!
మచ్చుకు కొన్ని..
కమ్మర్పల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన కృష్ణ చైతన్యకు సాంఘిక శాస్త్ర విభాగంలో వికలాంగుల కోటలో 780 ర్యాంకు వచ్చింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అయితే ఎంపిక జాబితాలో ఇతనికి బదులు 900 ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం కల్పించారు.
కృష్ణ చైతన్య విద్యాశాఖ అధికారులకు మొరపెట్టుకోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరు కాలేదని చెప్పారు. వాస్తవానికి ఇతను హాజరయ్యాడు. అధికారులు పున: పరిశీలన చేసి ఉద్యోగం కల్పించారు.
- ఉర్దూ మీడియంలో ఓ అభ్యర్థి ఈ ఏడాది జనవరిలో డైట్‌లో ఉత్తీర్ణత సాధించింది. జూన్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈమె ఉద్యోగానికి అర్హులై ఉండి ఎంపిక కాలేదు. మళ్లీ పరిశీలించి ఎంపిక చేశారు.
- ఓపెన్ కేటగిరి విభాగంలో తబస్సుమ్ 70 ర్యాంకు సాధించింది. అయితే 71 ర్యాంకు వచ్చిన అభ్యర్థిని ఎంపిక చేశారు. తబస్సుమ్ విద్యాశాఖ కార్యాలయంలో తెలియజేయగా పరిశీలన చేసి మళ్లీ ఎస్జీటీ విభాగంలో ఈమెకు ఉద్యోగం కల్పించారు.
- ఆశియా ఫిర్దోస్‌కు ఎస్జీటీ విభాగంలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది. ఈమె 52.87 మార్కులతో రెండవ ర్యాంకు సాధించింది. ఈ విభాగంలో ఒక్క పోస్టు మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఈమె ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైంది. ఈమెకు బదులు నిర్మల్ జిల్లాకు చెందిన సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేశారు. ఫిర్యాదు మేరకు పోస్టును నిలుపుదల చేశారు.
- సతీష్ వికలాంగుల కోటలో హిందీ సబ్జెక్టులో ఎంపికయ్యారు. ఇతను విశారాద్ కోర్సు పూర్తి చేశాడు. ఇది డిగ్రీతో సమానం. హిందీ లాంగ్వేజ్‌లో పీజీ చేశాడు. ధ్రువపత్రాల పరిశీల సమయంలో అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. అయితే 1:1 జాబితాలో ఇతన్ని ఎంపిక చేయలేదు. విద్యాశాఖ కార్యాలయంలో ధ్రువ పత్రాల పరిశీలలో ధ్రువ పత్రం చెల్లదన్నారు. తీరా మళ్లీ ఫిర్యాదు చేయడంతో అతను సమర్పించిన ధ్రువత్రాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించి ఉద్యోగం కల్పించారు.
- స్కూల్ అసిస్టెంట్ విభాగంలోని భౌతిక శాస్త్రంలో ప్రవీణ్ మూడో ర్యాంకు సాధించారు. మొదట ఉద్యోగం ఇచ్చి తొలగించారు.
జూన్ తర్వాత బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాదని విద్యాశాఖ ఇతని ఉద్యోగాన్ని నిలుపుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్‌లో బీఈడీ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. మళ్లీ ఇతని ఫిర్యాదు పరిశీలించిన అధికారులు ఉద్యోగం కల్పించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
నిజామాబాద్‌అర్బన్: డీఎస్సీ ఫలితాలలో నియామక పత్రం అందుకున్న జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డు కాలనీకి చెందిన ఊడ్తా నవత పోస్టింగ్ కోసం డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. నవత ఎస్జీటీ లోకల్ బాడి విభాగంలో 203 ర్యాంక్ సాధించి పోస్టుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 9న ముఖ్య మంత్రి నిర్వహించిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని అందుకున్నా రు. రిపోర్టింగ్ కోసం అక్టోబర్ 11న డీఈవో కార్యాలయానికి వెళ్లగా సాంకేతిక కారణాలు చెబుతూ ఆమెకు పోస్టు ను కేటాయించలేదు. ఇప్పుడు ఉద్యోగం లేదంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా స్పందించడం లేదని ఆమె వాపోయారు. బాధితురాలు సోమవారం ప్రజావాణికి వచ్చి కలెక్టర్, డీఈవోకు వినతిపత్రం అందించారు.
నిబంధనలు పాటించలేదు
డీఎస్సీ నియామకాల ప్రక్రి య ఆగమేఘాలపై చేపట్టా రు. చాలామందికి పోస్టుల ను కేటాయించలేదు. నిబంధనలను సక్రమంగా చూసుకోకుండా భర్తీ చేయడం సరైనది కాదు. ఇది వరకే మేము రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అధికారులను కలిసి విన్నవించాము. కోర్టును ఆశ్రయించడంతో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేశారు.
– కేశాపురం రమేశ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు