Skip to main content

PG Medical Seats: 25 వరకు తదుపరి చర్యలు తీసుకోం: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సు సీట్ల భర్తీలో ‘స్థానిక’ వివాదం నేపథ్యంలో న‌వంబ‌ర్‌ 25 వరకు సీట్ల భర్తీపై తదుపరి చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Local dispute filling of PG medical course seats in telangana

మెరిట్‌ జాబితాను కూడా ప్రకటించబోమని చెప్పింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం 25కు వాయిదా వేసింది. తెలంగాణ మెడికల్‌ కాలేజీల నిబంధనలు 2021లోని రూల్‌  VIII( i), ( ii)  చెల్లుబాటును సవాల్‌ చేస్తూ హైకోర్టులో మంచిర్యాలకు చెందిన డాక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ వి.రజిత పిటిషన్‌ దాఖలు చేశారు.

నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 148 చట్టవిరుద్ధమని, దీని ప్రకారం తెలంగాణలో బ్యాచిలర్‌ మెడికల్‌ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను మాత్రమే పీజీ మెడికల్‌ సీటుకు స్థానిక కోటా కింద పరిగణిస్తారన్నారు.

చదవండి: Jobs: పారదర్శకంగా కొలువుల భర్తీ.. విరి మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు

తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే తెలంగాణ వెలుపలి విద్యా సంస్థల్లో(సిద్దార్థ మెడికల్‌ కాలేజీ) చదివిన వారిని స్థానికులుగా పేర్కొనడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా దాదాపు 100కుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం న‌వంబ‌ర్‌ 18న విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ వరకు ఎటువంటి కౌన్సెలింగ్‌ నిర్వహించబోమని హామీ ఇచ్చారు.   
 

Published date : 19 Nov 2024 03:06PM

Photo Stories