Skip to main content

Groups Guidance: మొదటిసారిగా గ్రూప్‌ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

–ఎ.జంగయ్య, గ్రూప్‌–2 విజేత (ఎక్సైజ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌)
Question
నేను గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. మొదటిసారిగా గ్రూప్‌ 2 రాయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి?
  • గ్రూప్స్‌ అభ్యర్థులు లక్ష్యంపై స్పష్టతతో అడుగులు వేయాలి. అప్పుడే విజయం దక్కుతుంది. మీరు ముందుగా సిలబస్‌ అంశాలను పరిశీలించి.. వాటిలో మీకున్న నాలెడ్జ్‌ లెవల్‌ను తెలుసుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ప్రిపరేషన్‌ సమయంలో సిలబస్‌కు అనుగుణంగా మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. అకాడమీ పుస్తకాలను అభ్యసించడం తప్పనిసరి అని గుర్తించాలి. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు.. తెలంగాణ హిస్టరీ, సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి తెలంగాణ ప్రాంత ప్రాధాన్యం ఉన్న అంశాలకు అకాడమీ పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. నా ప్రిపరేషన్‌ సమయంలో తెలుగు అకాడమీ పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. వాటి ద్వారా పొందిన అవగాహనను తెలుసుకునేందుకు మోడల్‌ పేపర్స్‌ను ప్రాక్టీస్‌ చేశాను. 

    చదవండి: గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి
     
  • అభ్యర్థులు గుర్తించాల్సిన మరో విషయం.. గ్రూప్స్‌ సిలబస్‌ పూర్తి చేయాలంటే గంటల కొద్దీ చదవాలనే అభిప్రాయాన్ని వీడాలి. ఎంత సేపు చదివాం? అనే దాని కంటే చదివిన సమయంలో ఎంత ఏకాగ్రతతో ఆకళింపు చేసుకున్నాం..అనేది  ముఖ్యమని గుర్తించాలి. నా ఉద్దేశం ప్రకారం– డిగ్రీ స్థాయిలో అకడమిక్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫలితంగా అన్ని సబ్జెక్ట్‌లలోనూ అవగాహన, నైపుణ్యం సొంతం చేసుకునేందుకు వీలవుతుంది.

    చదవండి: ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
     
  • ప్రిపరేషన్‌ పూర్తయిందనుకున్న తర్వాత మాక్‌ టెస్ట్‌లు లేదా మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. పోటీ పరీక్షల్లో విజయం దిశగా ఈ వ్యూహం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల మలిదశ ప్రిపరేషన్, అదే విధంగా పరీక్ష హాల్లో అనుసరించాల్సిన టైమ్‌ మేనేజ్‌మెంట్‌పై స్పష్టత లభిస్తుంది. 

–ఎ.జంగయ్య, గ్రూప్‌–2 విజేత (ఎక్సైజ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌)
​​​​​​​

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

Photo Stories