పోటీ పరీక్షల్లో జీవ వైవిధ్యం, ఎకాలజీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
- ఎస్.రేవతి, హైదరాబాద్.
Question
పోటీ పరీక్షల్లో జీవ వైవిధ్యం, ఎకాలజీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
ఎకాలజీ, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలపై వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఆవరణ శాస్త్ర పరిభాష, ప్రాథమిక అంశాలైన జీవుల అనుకూలనాలు (Adaptations), ఆవరణ వ్యవస్థ, రకాలు, ఆహార శృంఖాలు, బయో జియో కెమికల్ సైకిల్స్ (Biogeo chemical cycles), ఆహార వల వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జీవ వైవిధ్యానికి సంబంధించి వాటి స్థాయి, రకాలు, జీవ వైవిధ్యానికి గల కారణాలు, ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవ వైవిధ్య హాట్‌స్పాట్స్, పరిరక్షణ పద్ధతులు, సమస్యలు మొదలైన వాటి గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. గతంలో ఈ విభాగంలో అడిగిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే.. దేశంలో రాబందుల సంఖ్య తగ్గడానికి కారణం? దీనికి సమాధానం.. పశువుల్లో అతిగా వాపు నివారణకు మందుగా ఉపయోగించే డై క్లోఫినాక్ అనే రసాయనం.
జీవ వైవిధ్యానికి ప్రమాదాలు అని ప్రస్తావించినప్పుడు.. ప్రస్తుతం సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల (వార్తల్లో అంశాలు)పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. బట్టమేక పక్షి (Great Indian Bustard)ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ (IUCN-The International Union for Conservation of Nature) క్రిటికిల్లీ ఎండేంజర్‌డ జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో సంబంధిత సమాచారాన్ని .. ఆ పక్షి విస్తరణ, దానికి ప్రత్యేకంగా ఏర్పడుతున్న ప్రమాదాలు, దాని శాస్త్రీయ నామం-వంటి అంశాల ఆధారంగా సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే దృక్పథాన్ని ఇతర సంఘటనలకు అన్వయించుకోవడం ప్రయోజనకరం.