Skip to main content

గ్రూప్స్‌లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రధానంగా చదవాల్సిన అంశాలేమిటి?

- ఆర్.ఎస్.వి.ప్రసాద్, హైదరాబాద్.
Question
గ్రూప్స్‌లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రధానంగా చదవాల్సిన అంశాలేమిటి?
మానవాభివృద్ధి సూచిక (Human Development Index), అసమానతలు, సమన్యాయం, లింగ వివక్ష సూచీ, బహుమితీయ పేదరిక సూచీ (Multidimensional Poverty Index); మిలీనియం వృద్ధి లక్ష్యాలు, పంచవర్ష ప్రణాళికలు- లక్ష్యాలు- వ్యూహాలు; ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులు, 11వ పంచవర్ష ప్రణాళిక విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు-ప్రగతి, వనరుల పంపిణీ; నీతి ఆయోగ్, పేదరికం- భావనలు- అంచనాలు, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు; నిరుద్యోగం-రకాలు, నిరుద్యోగ నిర్మూలనా కార్యక్రమాలు, శ్రామికశక్తి భాగస్వామ్యం, పనిలో పాలుపంచుకునే రేటు; జాతీయాదాయం-భావనలు, జాతీయాదాయ లెక్కింపులో సమస్యలు; పన్నుల వ్యవస్థ- పన్నుల సంస్కరణలు - వివిధ కమిటీలు, వస్తు సేవలపై పన్ను, కోశ విధానం; బ్యాంకింగ్ రంగం, ద్రవ్య మార్కెట్, ద్రవ్య విధానం, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు; వ్యవసాయ రంగం, హరిత విప్లవం, వ్యవసాయ పరపతి, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పరంగా వివిధ పంటల్లో రాష్ట్రాల స్థానం; పారిశ్రామిక తీర్మానాలు (1948, 1956, 1977, 1980, 1991), పారిశ్రామిక విత్త సంస్థలు; సేవా రంగం- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం; 2011 జనాభా లెక్కలు, డెమోగ్రాఫిక్ డివిడెండ్; ద్రవ్యోల్బణం - డబ్ల్యూపీఐ, సీపీఐ, ఐఐపీ, ద్రవ్యం; ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు; ప్రపంచ వాణిజ్య సంస్థ; విదేశీ వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, చెల్లింపుల శేషం, మూల్యహీనీకరణ; ఆర్థిక సంస్కరణలు-సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ తదితర అంశాలను చదవాలి.

Photo Stories