What After M.Sc: ఎమ్మెస్సీ తర్వాత ఎలాంటి కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయో తెలపండి?
Question
నేను బీఎస్సీ 2020లో పూర్తిచేసాను. గత ఏడాది కరోనా కారణంగా ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోలేకపోయాను. ప్రస్తుతం ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేద్దామనుకుంటున్నాను. నా వన్ ఇయర్ గ్యాప్ కెరీర్‌పై ఏమైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా? ఎమ్మెస్సీ అనంతరం ఎలాంటి కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయో తెలపండి?
- కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ఇందుకు విద్యారంగం కూడా మినహాయింపు కాదు. కాబట్టి కెరీర్ పరంగా మీకు ఒక సంవత్సరం గ్యాప్ వచ్చిందనే ఆందోళన వద్దు. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారు.. ఏమైనా కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నారా.. ఇంగ్లిష్‌పై పట్టు సాధించారా.. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకున్నారా.. సర్టిఫికేషన్స్ సొంతం చేసుకున్నారా.. ఇలాంటివి రెజ్యూమ్‌లో ప్రస్తావించడం ద్వారా.. భవిష్యత్‌లో రిక్రూటర్లను ఆకట్టుకోవచ్చు. అది మీ కెరీర్‌కు మరింత దోహదం చేస్తుంది.
- అదేవిధంగా ఎమ్మెసీ తర్వాత మంచి కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. టీచింగ్‌పై ఆసక్తి ఉంటే ఎమ్మెస్సీ ఉత్తీర్ణులయ్యాక అధ్యాపకుడిగా మారొచ్చు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లేదా ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన రంగంలో రాణించొచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేయవచ్చు. దీనిద్వారా రీసెర్చ్ అనలిస్ట్, మెడికల్ రీసెర్చ్ ల్యాబ్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీలలో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.