Skip to main content

Diwali School Holidays 2024: దీపావళికి వ‌రుస‌గా 5 రోజులు సెల‌వులు..

ఈ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 31వ‌ తేదీ దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది.
5 Days Holidays Due To Diwali Diwali festival in India Diwali holidays latest news

ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్‌ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించించారు.

దీపావళి సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ సెలవులను ప్రకటించారు. నవంబర్ 3 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 4న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటీసు జారీ చేశారు.

దీపావళికి ఆదివారంతో కలుపుకుని ఆరు రోజుల పాటు సెలవు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్‌ ఒకటిన సెలవు ప్రకటించారు.

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

 

Published date : 23 Oct 2024 05:47PM

Photo Stories