Skip to main content

High School Timings : ఉన్నత పాఠ‌శాల‌లో పనివేళల్నిలో మ‌రో గంట పెంచేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు.. కానీ!

ఉన్నత పాఠశాలల పనివేళల్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Government trials of extending the duration of working hours in high school

అమరావతి/కదిరి: ఉన్నత పాఠశాలల పనివేళల్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్న వీటిని 5 గంటల వరకు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పనివేళలను గత ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మార్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజుకు 7 పీరియడ్స్‌ ఉండేవి. 

CM Trophy: సీఎం ట్రోఫీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్న జంట ఇదే..

ఇకమీదట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 8 పిరియడ్‌ల్లో హైస్కూల్‌ నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేయాలని, ఆ జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాల­ను ఎంపిక చేయాలని ఈ నెల 16న  ప్ర­భు­త్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలల జాబితాను ఈ నెల 20లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్‌ ప్రకారం తరగతులు నిర్వహిస్తారు. 

NID Admissions: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో అడ్మీషన్స్‌.. చివరి తేదీ ఇదే

ఇది సక్సెస్‌ అయిందని ప్రభుత్వం భావిస్తే వెంటనే ఈ విద్యా సంవ­త్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అ­మ­లు చేయాలని యో­చి­స్తోంది. కాగా, పాఠశాలల పనివేళల పెంపు తలకు మించిన భారంగా మారుతుందని..విద్యా­శాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్‌) అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. 

అలాగే, ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని మార్చాలన్న నిర్ణయం సరైంది కాదని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌­రెడ్డి, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమయాలు పిల్లల  సైకాలజీకి అనుగుణంగా ఉన్నాయని, మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

 
ప్రతిపాదిత టైం టేబుల్‌ ఇలా..
» ఉదయం 9కి మొ­దటి గంట, 9.05కు రెండో­గంట, 9.05 నుంచి 9.25 వరకు ప్రార్థన. 
»  9.25–10.15 వరకు మొద­టి పీరియడ్.
»  10.15–11 వరకు రెండో పిరియడ్‌. 
»  11–11.15 వరకు విరామం. 
»  11.15 నుంచి మధ్యాహ్నం 12 వరకు మూడో పిరియడ్
»  12–12.45 వరకు నాలుగో పీరియడ్‌...
»  12.45–1.45 వరకు భోజన విరామం. 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»   1.45–2.30 వరకు ఐదో పీరి­యడ్
»   2.30–3.15 వరకు ఆరో పీరియడ్‌.
»   3.15–3.30 వరకు చిన్న విరామం. 
»   3.30–4.15 వరకు ఏడో పీరియడ్
»   4.15–5 గంటల వరకు 8వ పీరియడ్‌.

Published date : 18 Nov 2024 03:29PM

Photo Stories