Skip to main content

School timings changed: విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ టైమింగ్స్ మార్పు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

School timings changed
School timings changed

బడి పనివేళల్లో మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్ల పనివేళల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఈ ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ పాఠశాల విద్యా శాఖ

రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల టైమింగ్స్ ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా.. దీనిని 5 గంటల వరకు పెంచింది ప్రభుత్వం. అకడమిక్‌ క్యాలెండర్‌లో ఆప్షనల్‌గా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ పాఠశాల విద్యా శాఖ.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 7438 ఉద్యోగాలు: Click Here

ముందుగా ప్రయోగాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మండలానికి రెండు హైస్కూల్ లలో ఈ విధానాన్ని అమలు చేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

భోజన విరామం 15 నిమిషాలు

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ఉదయం మొదటి పీరియడ్‌ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచారు. అదేవిధంగా ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్‌ల సమయం 5 నిమిషాల చొప్పున, భోజన విరామం 15 నిమిషాలు పెంచారు.

ప్రతి రోజు 1గంట సమయం..

నవంబర్‌ 25 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లల్లో పని వేళలు ఇలా మారబోతున్నాయి. ప్రభుత్వం చేసిన ఈ మార్పులతో ప్రతి రోజు స్కూల్ సమయం ఒక గంట పెరగనుండటం విశేషం. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానంలో వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇదే విధానాన్ని అమలు చేయాలనీ ప్రభుత్వం భావిస్తోందట. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, బడుల కొత్త పని వేళలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

Published date : 19 Nov 2024 08:25PM

Photo Stories