Skip to main content

Duration Extension : పాఠ‌శాల‌లో ప‌నివేళలో ప్ర‌భుత్వం చేసిన మార్పుల‌పై ఎస్‌టీయూ ఆందోళ‌న‌..

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేయడం సబబుకాదన్నారు ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు.
Extension of working hours in government schools by ap govt

కడప: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనివేళలు మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్‌ బాషా పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేయడం సబబుకాదన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించకుండా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయం అంతా బోధనకు మాత్రం పరిమితం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఒకవైపు డిమాండ్‌ చేస్తుంటే పాఠశాలల పనివేళలు సాయంత్రం 5 గంటల వరకు పెంచడం సహేతుకం కాదని అభిప్రాయ పడ్డారు.

AP School Timings Changed: విద్యార్థులకు అలర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు

ఉపాధ్యాయులను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే అత్యుత్సాహం తప్ప బోధనలో నాణ్యతా ప్రమాణాలు ఎలా అభివృద్ధి చేయాలా అనే లక్ష్యాలు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. ఇది విద్యారంగ సంక్షేమానికి ఉపయోగకరం కాదన్నారు. ఏపీలో పని వేళలు పెంచడానికి పైలట్‌ ప్రాజెక్టు చేపట్టడంలోని ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. పనివేళల హెచ్చింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తే తద్వారా సాధించదలచుకున్న లక్ష్యాలను చదువు చెప్పే ఉపాధ్యాయులకు తెలియజెప్పాలన్నారు. అలా కాకుండా ఒక రహస్య అజెండాతో ముందుకెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు.

Anganwadi Employees Salary Hike : అంగన్వాడీలకు జీతాల పెంపు మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. వీరి ఇక నుంచి...!

పాఠశాల పని వేళలు ఎలా ఉండాలనేది విద్యార్థుల్లో అభ్యసన సంసిద్ధత, మానసిక పరిపక్వత, స్థానిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ప్రజల జీవన విధానం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్నాయన్నారు. 70 శాతానికి పైబడి గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రామాణికంగా తీసుకొని ప్రయోగాలు చేయాలి తప్ప అన్ని వసతులు కలిగిన పట్టణ ప్రాంతాలతో బేరీజు వేయకూడదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎస్‌టీయూ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Nov 2024 09:59AM

Photo Stories