Skip to main content

Anganwadi Employees Salary Hike : అంగన్‌వాడీ ఉద్యోగుల‌ జీతాల పెంపుపై మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఇక‌పై వీరికి..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు.
ap anganwadi worker salary 2024

వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై మంత్రి ఎట్ట‌కేల‌కు స్పందించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని మంత్రి వెల్లడించారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లింపు, జీతాల పెంపు విషయం పరిశీలనలో ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ఇలాంటి సమ్మె వల్ల సమస్యలు పరిష్కారం కాద‌న్నారు. అంగన్వాడీల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలని కోరారు.

☛➤ 11000 Anganwadi Jobs Notification 2024 : భారీ గుడ్‌న్యూస్‌.. 11000 అంగన్‌వాడీల ఉద్యోగాల‌కు నోటిపికేష‌న్‌.. త్వ‌ర‌లోనే.. పోస్టుల భ‌ర్తీ ఇలా..!

మాకు న‌మ్మ‌కం లేదు...?
అంగన్వాడీ కార్యకర్తలు జిల్లాల‌ కలెక్టరేట్ల వద్ద చేసిన ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. కానీ మంత్రి గారు ఇచ్చిన హామీని చాలా మంది అంగన్వాడీల కార్య‌క‌ర్త‌లు న‌మ్మ‌డం లేదు.

Published date : 19 Nov 2024 05:15PM

Photo Stories