AP Anganwadi workers Updates 2024 : ప్రతి జిల్లాలో తెరుచుకున్న అంగన్‌వాడీ కేంద్రాలు.. ఇకపై వీళ్లకు..
తిరుపతి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు మంగళవారం పునఃప్రారంభమయ్యా యి. గత డిసెంబర్ 12 నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మెబాటపట్టారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 2,492 అంగన్‌వాడీ కేంద్రాలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆయా ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ వర్కర్లను సమన్వయం చేసుకుని సరుకులు ఏమైనా మిగిలి ఉంటే చెడిపోకుండా పంపిణీ చేయాలని సీడీపీఓలు, సూపర్‌వైజర్లను ఆదేశించారు.
ఈ నేపథ్యంతో జనవరి 23వ తేదీన (మంగళవారం) జిల్లాల్లోని పలు నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించి, సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్న పిల్లలు, గర్భిణులకు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం అందజేశారు. అంగన్‌వాడీ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని, తమ కోర్కెలు అంగీకరించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాటల్లో..
☛ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం
☛ జూలైలో జీతాలు పెంచుతాం
☛ ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం
☛ హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం
☛ మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం
☛ సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం
☛ సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం
☛ వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం
☛ గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం
☛ ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం
☛ అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం
☛ మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి
☛ కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు
☛ మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం
సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి మాటల్లో..
☛ జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు
☛ మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు
☛ రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు
☛ మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది
☛ అగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు
☛ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది
☛ టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది
☛ సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తాం అన్నారు
► సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు... కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
Tags
- AP Anganwadi Helper salary
- ap anganwadi jobs news in telugu
- AP Anganwadi Helper salary details
- good news for ap anganwadi employees
- ap anganwadi employees salary hike
- ap anganwadi employees promotion
- ap anganwadi centers reopen
- ap anganwadi workers with botsa satyanarayana
- GovernmentSupport
- andhrapradesh
- AnganwadiCenters
- sakshi education latestnews