Skip to main content

DLSA Jobs: డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి న‌వంబ‌ర్‌ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జస్టిస్‌ యం.సాయి కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Applications for filling up jobs in DLSA news in telugu

వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ. నిర్మలా గీతాంబ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. స్టెనోగ్రాఫర్‌ (1), టైపిస్ట్‌ (1), రికార్డ్‌ అసిస్టెంట్‌ (2) పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

దరఖాస్తుల్ని న‌వంబ‌ర్‌ 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా డిస్టిక్ర్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ–వరంగల్‌, డిస్ట్రిక్ట్‌ కోర్టు కాంప్లెక్స్‌కు పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు వరంగల్‌ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

నియామక ప్రక్రియకు సంబంధించి అన్ని అంశాలను వరంగల్‌ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.

Published date : 16 Nov 2024 05:16PM

Photo Stories