Skip to main content

Good News for AP Anganwadi Employees : ఏపీ అంగన్‌వాడీలకు ఉద్యోగుల జీతాలు పెంపు, గ్రాట్యుటీపై ప్ర‌భుత్వం..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అంగన్‌వాడీలకు ఉద్యోగులు అడిగిన డిమాండ్లుపై నేడు అన‌గా డిసెంబ‌ర్ 26వ తేదీన‌(మంగ‌ళ‌వారం) స‌చివాల‌యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, Minister for Women and Child Welfare Ushashri Charan అంగన్‌వాడీలకు ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.
AP Secretariat talks with Anganwadi unions about employee demands  good news for anganwadi employees andhra pradesh Anganwadi Trade Union meeting with AP Ministers on December 26    Minister Ushashri Charan meets Anganwadi trade unions at Secretariat   AP Education Minister Botsa Satyanarayana in discussion with Anganwadi Trade Unions

ఈ సంద‌ర్భంగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి నుంచే అంగన్‌వాడీ ఉద్యోగులకు అనుకులంగా ఉంటూ.. వీరి సంక్షేమం కోసం విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు. అలాగే అంగన్‌వాడీలకు ఉద్యోగులు అడిగిన డిమాండ్లుపై వీరు సానుకులంగా స్పందించ‌న‌ట్లు తెలుస్తుంది. జీతాలు పెంపు, గ్రాట్యుటీపై పెంపుపై ప‌ట్టుబ‌డుతున్న అంగన్‌వాడీలకు ఉద్యోగులు డిమాండ్లుకు ప్ర‌భుత్వం అనుకులంగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

11 డిమాండ్ల‌లో 10 డిమాండ్ల‌ల‌ను అమోదించామ‌ని..

minister satya narayana

అంగ‌న్‌వాడీల ఉద్యోగుల 11 డిమాండ్ల‌లో 10 డిమాండ్ల‌ల‌ను అమోదించామ‌ని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు వారాల నుంచి అంగన్ వాడీ వర్కర్ లు,  హెల్పర్ లు ఆందోళనలు చేపడుతున్న విష‌యం తెల్సిందే .తమ డిమాండ్లను పరిష్కరించాలని జీతాల పెంపుదలతో పాటు ఆర్థికపరమైన డిమాండ్లు  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని మరికొన్ని సమస్యలను పెండింగ్ లో ఉన్నాయని అంగన్ వాడీ వర్కర్ల సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంత్రివర్గం ఉప సంఘంతో అంగన్ వాడీ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే జీతాల పెంపుకు కొద్ది స‌మయం కావాల‌ని మంత్రివర్గం ఉప సంఘం కోరింది. అలాగే గ్రాట్యూటీ త‌మ ప‌రిధిలో  లేద‌ని  మంత్రి బొత్స తెలిపారు.  వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగామ‌న్నారు.  అలాగే సంక్రాంతి తర్వాత దీనిపై మరోసారి చర్చిస్తామని మంత్రి తెలిపారు. అంగన్ వాడీ ఉద్యోగుల ప‌ట్ట త‌మ ప్ర‌భుత్వం సానుకులంగా ఉంద‌ని.. సమ్మె విరమించాల‌ని మేము వారి బెదిరించ‌డం లేద‌ని.. రిక్వెస్ట్ చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చాం. గర్భిణీలు బాలింతల ఇబ్బందుల దృష్ట్యా.. సమ్మె విరమించాలి అని స్పష్టం చేశారు. 

దీంతో తదుపరి కార్యాచరణ పై యూనియన్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు అంగన్ వాడీ లతో.రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం జరిగింది. 

మొద‌టి నుంచి బడుగు బలహీనవర్గాలకు మేలుచేసే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, వాటిలో సేవలందిస్తున్న వర్కర్లు, ఆయాలపట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి నుంచీ సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఆ కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు అంగన్‌వాడీలకు మెరుగైన జీతాలిచ్చింది కూడా సీఎం జగన్‌ ప్రభుత్వమే. చంద్రబాబు జమానాకంటే సీఎం జగన్‌ పాలనలోనే వీరి వేతనాలు పెరిగాయి. ఎలాగంటే.. 2014 నుంచి 2016 వరకు ఈ వర్కర్లకు కేవలం రూ.4,200 మాత్రమే గౌరవ వేతనం ఇచ్చిన చంద్రబాబు 2016లో కంటితుడుపు చర్యగా రూ.ఏడు వేలకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల మూడు నెలలపాటు అదే అరకొర జీతంతో సరిపెట్టారు.

టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలుపడిన అంగన్‌వాడీలకు..

ap anganwadi employees news telugu

2018లో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్‌వాడీలకు గౌరవ వేతనం పెంచుతానని ప్రతిపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో అప్పుడుగానీ చంద్రబాబుకు వారి జీతాలు గురించి గుర్తురాలేదు. దీంతో ఎన్నికలకు ఆర్నెల్ల ముందు హడావుడిగా వేతనాలు పెంచినట్లు మోసపూర్తింగా జీవో ఇచ్చారు కానీ, అమలు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ తెలంగాణా కంటే అధికంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలు చొప్పున పెంచి అందిస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలుపడిన అంగన్‌వాడీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి నాలుగున్నరేళ్లుగా ఆ మొత్తాన్ని అందిస్తోంది.

ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా..

ys jagan anganwadi news telugu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అంగన్వాడీ ఉద్యోగుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ చెప్పిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచుతూ కీల‌క నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్వాడీల పదవీ విరమణ సెటిల్మెంట్ ను లక్ష రూపాయలకు పెంచింది. దీంతో పాటు.. అంగన్వాడీ సహాయకుల పదవీ విరమణ వయస్సును కూడా 62 ఏళ్ల‌కు పెంచిన ప్రభుత్వం, సెటిల్మెంట్ ను రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల‌ మరి కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి అంగన్వాడీ ఉద్యోగుల‌కు అనుకులంగా ఉంటూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం మంచి నిర్ణ‌యాలు తీసుకుంటూ.. వ‌స్తుంది. ఇలా చెప్పుకుంటా పోతే.. అంగన్వాడీ ఉద్యోగుల‌కు ఈ వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం చేసిన మేలు ఏఏ ప్ర‌భుత్వం చేయ‌లేదు అని గ‌ర్వంగా చెప్ప‌గ‌లరు ఈ ఉద్యోగులు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు, అంటే గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అంగన్‌వాడీ వర్కర్ల జీతం నెలకు రూ.7 వేలు, హెల్పర్లకు రూ.4,500 మాత్రమే. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నంబర్‌ 18 జారీ చేసింది. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు నెలకు రూ. 11,500కు, హెల్పర్లకు రూ. 7 వేలకు పెంచుతూ 2019 జూన్‌ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు చెల్లిస్తోంది. 

సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వారికి..
2013 నుంచి అంగన్‌వాడీలకు పదోన్నతులు లేవు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్‌–2 సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేసింది. ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. అంగన్‌వాడీ వర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు కూడా ఇచ్చింది. 56,984 స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలుకు రూ. 85.47 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అదనంగా 1 జీబీ డేటా కూడా ఇస్తోంది.  

అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి..
రూ. 16 కోట్ల ఖర్చుతో ఒక్కో అంగన్‌వాడీ వర్కర్‌కు, హెల్పర్‌కు 6 చొప్పున యూనిఫాం శారీలు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నారు. పదవి విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది.  

అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ..
నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాణ్యంగా కనీస మౌలిక సదుపాయాలను అందించేలా చర్యలు చేపట్టింది. 10,932 అంగన్‌వాడీ కేంద్రాలు (సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి రీలొకేట్‌ అయినవి) మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ. 500 కోట్లతో మిగిలిన 45,000 అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనుల్లో భాగంగా అంగన్‌వాడీ భవనాలకు రిపేర్లు, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌ ఉపకరణాలు, రంగులు, రక్షిత తాగునీరు, గోడలపై బొమ్మలు తదితర పనులు చేపడుతున్నారు. 

అంగన్‌వాడీ వర్కర్లకు..
స్మార్ట్‌ టీవీల ఏర్పాటుతో పాటు పిల్లల్లో నేర్చుకునే విధానాలను మెరుగుపరచడానికి ప్రత్యేక కిట్లు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని 8.5 లక్షల మంది పిల్లలకు ఈ కిట్లను ప్రభుత్వం ఇస్తోంది. దీంతోపాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అంగన్‌వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాల ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పిల్లల ఎదుగుదలను పరిశీలించేందుకు రూ.16.04 కోట్ల ఖర్చుతో 19,236 పరికరాలను అంగన్‌వాడీ స్కూళ్లకు ప్రభుత్వం అందిస్తోంది. గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది.   

గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌ హోం రేషన్‌ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే.. అంగన్వాడీ ఉద్యోగుల‌కు ఈ వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం చేసిన మేలు ఏఏ ప్ర‌భుత్వం చేయ‌లేదు అని గ‌ర్వంగా చెప్ప‌గ‌లరు ఈ ఉద్యోగులు.

అంగన్‌వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌..
గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సగటు వేతనం భారీగా పెరిగింది. అంతేకాదు.. అంగన్‌వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ అని నీతిఆయోగ్‌ ప్రశంసించింది. అంగన్‌వాడీ వర్కర్లకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ఆరవ స్థానంలోను, హెల్పర్ల వేతనాల్లో నాల్గవ స్థానంలో ఉండటం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోనే అంగన్‌వాడీలకు అసలైన మేలు జరిగింది.  

అత్యాధునికంగా అంగన్‌వాడీ కేంద్రాలు.. 

ap anganwadi employees good news telugu

అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణకు వైఎ­స్సా­ర్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది.  
☛ నాడు–నేడు ద్వారా అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. వీటికి అవసరమైన వస్తువులు, స్టేషనరీకి 48,770 మెయిన్‌ కేంద్రాలకు రూ.500 చొప్పున.., 6,837 మినీ కేంద్రాలకు రూ.250 చొప్పున మొత్తం 55,607 కేంద్రాలకు రూ.7.81కోట్లు మంజూరు చేసింది.  
☛ సొంత భవనాల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులకు 21,206 కేంద్రాలకు (ఒక్కొక్క దానికి రూ.3వేలు చొప్పున) మొత్తం రూ.6.36 కోట్లు విడుదల చేసింది.  
☛ అద్దె భవనాల్లో ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని 16,575, పట్టణాల్లోని 6,705 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.66.54 కోట్ల అద్దె బకాయిలు చెల్లించింది.  
☛ అవకాశం ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మారుస్తోంది. 

అంగన్‌వాడీల మేలు కోరిన ప్రభుత్వం ఇదే.. 
వేతనాల పెంపే కాదు.. అంగన్‌వాడీలు అడిగిన డిమాండ్లను సైతం సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద మనస్సుతో ఆమోదించి అమలుచేస్తున్నారు. అంగన్‌వాడీల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా (డిసెంబ‌ర్‌ 20న) మరికొన్ని ఉత్తర్వులు జారీచేసింది. 

అవేమిటంటే.. 
☛ అంగన్‌వాడీ సహాయకులను కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీఓఎంఎస్‌–44 జారీచేసింది.  
☛ సెక్టార్, యూనిట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు టీఏ, డీఏలు ఇవ్వాలన్న అంగన్‌వాడీల కోరికపై సానుకూలంగా స్పందించి మెమో నెంబర్‌.2303564/2023 జారీచేసింది.  
☛ అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి టీఏ, డీఏలు చెల్లించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.  
☛ వీటితోపాటు అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల ఉద్యోగ వి­రమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. 
☛ అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీసు విరమణ తర్వాత వన్‌టైం బెనిఫిట్‌ రూ.50 వేలను రూ.1 లక్షకు పెంచింది.  ☛ సహాయకుల సర్విసు విరమణ తర్వాత వన్‌టైం బె­నిఫిట్‌ రూ.20వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రతి ఒక్కరికీ యూనిఫారం (ఆరు చీరలు చొప్పున) అందించేందుకు రూ.16 కోట్లను ఖర్చుచేసింది.  వారి విధులు సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలు అందించడానికి ఈ ప్రభుత్వం రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్‌ఫోన్లు కొని, అం­దించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరి­స్తూ అదనంగా ఏడాదికి రూ.12కోట్లు చెల్లిస్తోంది.  
☛ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపజేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది.  ☛ అంగన్‌వాడీల ద్వారా నాణ్యమైన సరుకుల పంపిణీని పర్యవేక్షించేందుకు దాదాపు 500 మంది సూపర్‌వైజర్లను కూడా నియమించింది.  
☛ గర్భవతులు, బాలింతలు, పిల్లలకు గతంలోలా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌హోం రేషన్‌ పద్ధతిని  అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పనిభారం తగ్గింది. 2023 నుంచి డ్రై రేషన్‌ అందిస్తోంది.  
☛ మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా చెల్లిస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి పదోన్నతులు..
ఇక అంగన్‌వాడీలకు 2013 నుంచి పదో­న్నతులు ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలి­సారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రమో­షన్లు ఇచ్చింది. మరోవైపు.. 560 గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీచేసింది. 

ఇదే సందర్భంలో ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వయో పరిమితి పెంపు చాలా ఉప­యోగపడింది. ప్రభుత్వం అమలు­చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించింది. ఇక నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ రైతుభరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి కూడా వర్తింపజేయడం గమనార్హం.

Published date : 26 Dec 2023 10:22PM

Photo Stories