Skip to main content

Anganwadi Jobs 2025 : గుడ్‌న్యూస్‌.. అంగన్వాడీ ఉద్యోగుల‌కు జీతాలు పెంచుతాం ఇలా.. అలాగే కొత్త‌గా 14,236 ఉద్యోగాల‌కు...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ మహిళ శిశు సంక్షేమ‌ శాఖ మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని మంత్రి సీతక్క హామీనిచ్చారు.
anganwadi emp salary hike and  jobs notification 2025  Telangana Minister Seethakka announces Anganwadi salary hike  Telangana government to fill Anganwadi vacancies district-wise

అలాగే ఖాళీగా ఉన్న 14,236 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే జిల్లాల వారీగా భర్తీ చేస్తామన్నారు. ఈ మేర‌కు జిల్లాల వారిగా కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇస్తారన్నారు.

అర్హ‌త‌లు ఇవే..
ఈ నోటిఫికేష‌న్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6,399 ఆంగన్‌వాడీ టీచర్లు,  7,837 ఆంగన్‌వాడీ సహాయకుల ఖాళీలను భర్తీ చేయనుంది. అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగంకు కనీసం ఇంటర్‌ పాసై ఉండాలి. గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు కనీసం పదో తరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్‌ పోస్టుల్లోనూ 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.ఇందుకు అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే.., ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో.. టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమశాఖ భావిస్తోంది.

Published date : 26 Mar 2025 09:12AM

Photo Stories