TSPSC Group 3 Exam Instructions 2024 : ఇవి తెలుసుకుంటే.. TSPSC గ్రూప్-3 ఉద్యోగం మీదే..! | Group 3 Exam Answer Sheet Bubbling చేసే టైమ్‌లో...
TGPSC Group-3 Exams నవంబర్ 17, 18 తేదీల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో.. పరీక్షకు వారం రోజులు ముందు ప్రిపరేషన్ ప్లాన్, పరీక్ష రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి...? ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలు రాయడం ఎలా...? TGPSC Group-3 Exam Answer Sheet Bubbling చేసే టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...? ఇలా మొదలైన అంశాలపై TGPSC, APPSC Examsకి సంబంధించిన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు K. Mahender Reddy గారితో సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.... టీజీపీఎస్సీ గ్రూప్–3 పోస్ట్‌లకు పోటీ ఎక్కువగానే ఉంది.
మొత్తం 1,363 పోస్ట్‌లకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు ఈ పోటీని చూసి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పటి వరకు సాగించిన ప్రిపరేషన్ శైలికి భిన్నంగా.. ఇకపై వేగంగా పలుమార్లు రివిజన్ చేయడంపై దృష్టిపెట్టాలని ప్రముఖ నిపుణులు సూచిస్తున్నారు.