World Radio Day : ప్రపంచ రేడియో దినోత్సవం.. చరిత్ర, ప్రఖ్యాతలు

సాక్షి ఎడ్యుకేషన్: ప్రపంచవ్యాప్తంగా మొదట ముందుకు వచ్చి పరిచయమైన మీడియా ప్రింట్. ఈ మీడియా చాలా మందికి చేరువైంది. దీంతోనే ప్రపంచంలోని ప్రతీ వార్త ప్రజల్లోకి వెళ్లేది. అప్పటినుంచే టెక్నాలజీ పెరగడం ప్రారంభమైంది. దీంతో, నెమ్మదిగా.. ప్రింట్‌తోపాటు రేడియోను కూడా ప్రారంభించారు. ఈ రేడియో ప్రసంగాన్ని 19వ శతాబ్దం చివరిలో రూపోందించారు.
American Teacher: రష్యా చెర నుంచి విడుదలైన అమెరికా టీచర్
భారతదేశానికి మాత్రం 20వ దశాబ్దం ప్రారంభంలో వచ్చింది. ఈ రేడియో రాకతో ప్రింట్‌తోపాటు ఆడియో చానల్ కూడా ప్రారంభమైంది. ప్రింట్‌తో కేవలం చదవగలం, రేడియోతో కేవలం వినగలం. అప్పటివరకు చదివే వార్తలను రేడియో రాకతో చదవడం, వినడం రెండూ సాగేవి.
రేడియో దినోత్సవంగా ఎలా అంటే..
మొదటి సారి రేడియోలో ప్రసంగించింది 1895లో గుగ్లిఎల్మో మార్కోని. 1946లో ఐక్యరాజ్యసమితి రేడియో స్థాపన తర్వాతి రోజును గుర్తించారు. నేడు, రేడియో ప్రచారం ప్రపంచవ్యాప్తంగా సమాచార ప్రసారం, అభివృద్ధి, మనోభావాలను పంచుకోవడానికి అత్యంత కీలకమైన సాధనంగా మాన్యమైనది.
మరీ ముఖ్యంగా ప్రింట్ మీడియో ప్రజల్లోకి వెళ్లినట్లు, రేడియో ప్రసంగం కూడా ప్రజల్లోకి వెళ్లాలి. కేవలం చదవడమే కాదు, వార్తలు చదవడంలో ఉండే ఆ స్పష్టను తెలియజేసేందుకు, ప్రజల్లో రేడియో ప్రచారాన్ని మరింత చేరువ చేసేందుకు, దీని అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగానే ఆశయంతో యునెస్కో ఈ రోజున అంటే, ప్రతీ ఏటా ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రకటించింది.
ప్రఖ్యాతుల ఇవే..
ప్రింట్ మీడియో ఉండగా రేడియోను ప్రారంభించారేంటా అని అప్పట్లో చాలామందికి ప్రశ్నార్థకం ఉండేది.. అయితే, రేడియో అనేది ఈ సమాజంలో సంస్కృతి, సమాచార ప్రసారం లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, ప్రజలకు మరింత చేరువవుతుందని, ప్రతీ నిమిషంలో ప్రతీ చిన్న పెద్ద వార్తను వెంటనే తెలుసుకునేలా తీర్చిదిద్దారు.
అంతేకాకుండా, రేడియోతో మరిన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రింట్‌తో పోల్చాలంటే, నేడు జరిగిన ప్రతీ వార్తను పేపర్‌లో రాసి, మరుసటి రోజు అందిస్తారు. కాని, రేడియోలో ఉన్న ప్రఖ్యాత ఇదే.. ప్రతీ వార్తను, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలను వినిపిస్తుంది ఈ రేడియో. ఇందులో ఒకటి రెండు విషయాల గురించే ప్రచారం జరగదు. సమాజంలోని ముఖ్యమైన సంఘటనలు, విద్య, వైద్య, ఫ్యాషన్, టెక్నాటజీ, ఉద్యోగాలు, వంటివి అనేక వివరాలు రోజూ ప్రచారం అవుతాయి.
చరిత్ర..
1. రేడియో పుట్టుక:
వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు అంతా కలిసి అనేక దశాబ్దాలుగా రేడియో తరంగాలను పరిశోధించారు. దీని, "క్రియాశీలత"ను 1860లు మధ్య జేమ్స్ క్లర్క్ మ్యాక్స్‌వెల్ పరిచయం చేశారు. ఆయన ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ గురించి కూడా ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు.
గులియెల్మో మారకోనీ (Guglielmo Marconi), 1895లో ప్రపంచానికి ప్రథమ రేడియో సంకేతాన్ని ప్రసారం చేసారు. ఆయనకు "రేడియో పితామహుడు" అని కూడా పిలువబడుతుంది.
2. రేడియో పురోగతి:
అమెరికాలోని KDKA (కేడీకేఏ) అనే రేడియో స్టేషన్‌లో 1920లో తొలి ప్రచారం జరిగింది. దీనిని ప్రపంచంలో తొలి కమర్షియల్ రేడియో ప్రసారంగానే గుర్తించబడింది.
1930: BBC (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) బ్రిటన్‌లో రేడియో ప్రసారాలు మొదలు పెట్టింది. ఇది ప్రపంచంలో ప్రసార రేడియో చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి.
Hyderabad Apollo Hospitals jobs: డిగ్రీ అర్హతతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌లో భారీగా ఉద్యోగాలు
4. భారతదేశంలో రేడియో:
భారతదేశంలో రేడియో ప్రసారాలు సరికొత్తగా 1936లో కాలకత్తా నుండి ప్రారంభం అయ్యింది. ఈ రేడియో స్టేషన్ పేరు ఆల్ ఇండియా రేడియో (AIR) గా పేరొందింది.
1957లో రేడియో సిటీ మొదటి కమర్షియల్ రేడియో స్టేషన్ హైదరాబాదులో ప్రారంభమైంది.
ఇక 1990లో రేడియో ధ్వని విస్తరణ పెరిగింది, టెలివిజన్, ఇంటర్నెట్, ఇతర మీడియా అభివృద్ధి చెందడం ప్రారంభించింది.
5. ప్రపంచ రేడియో దినోత్సవం:
UNESCO 13 ఫిబ్రవరి రోజున ప్రపంచ రేడియో దినోత్సవంగా 2011లో ప్రకటించింది. ఇక అప్పటినుంచి ప్రతీ ఏటా ఈరోజున రేడియో దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది రేడియో ప్రాముఖ్యతను గుర్తించడానికి, దీనితో సమాచార ప్రాప్తి, ప్రజల అనుభవాలు, సంస్కృతిని పంచుకోవడాన్ని, అంతేకాకుండా, ప్రజలు వార్తను నేరుగా వినడం కూడా ఈ రేడియోతోనే సాధ్యమైంది. రోజులు పెరుగుతున్నాకొద్ది ప్రజలనుంచి ప్రోత్సహం కూడా ఎక్కువైంది. నేడు రేడియోకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.
Unani Medicine: యునాని వైద్యంపై అంతర్జాతీయ సదస్సు
రేడియోతో ఉపయోగాలు..
ప్రపంచవ్యాప్తంగా నేడు సాంకేతిక అభివృద్ధి ఎంత శాతం ఉన్నప్పటికీ, ప్రజలు రేడియో మర్చిపోలేదు. వివిధ రకాలుగా రేడోయోలోని ప్రసంగాలను వింటూనే ఉన్నారు. సెల్‌ఫోన్లో, కారులో, అభివృద్ధి చెందిన రేడియోలు, ఇలా వివిధ రకాలుగా రేడియో ప్రసంగాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి అభిమానులూ పెరుగుతూనే ఉన్నారు. మనం ఎక్కడ ఉన్న ఈ రేడియో ప్రచారాన్ని వినే వీలు ఉంటుంది. ఎన్నో ముఖ్యమైన వార్తలు, ఆసక్తికరమైన ముఖాముఖీలు, విద్యా వైద్య ప్రసంగాలు వస్తూనే ఉన్నాయి. దీనిలో ప్రచారం వినేందుకు డబ్బులు కూడా చెల్లించాల్సిన పనిలేదు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- World Radio Day
- february 13th
- importance and significance
- radio invention
- first radio session
- UNESCO
- radio inventors and scientists
- 1895
- Technology Development
- radio importance
- radio then and now
- history for radio day
- international celebration for radio day
- uses for radio
- importance of radio in competitive exam
- print and sound media
- development of radio
- importance of radio
- general knowledge on radio
- general knowledge topics in telugu
- radio history for competitive exams
- Education News
- Sakshi Education News
- History of print media