Indian Students: విదేశాల్లో చదువుకునేందుకే మొగ్గు చూపుతున్న భారతీయ యువత.. ఇష్టపడుతున్న దేశాలు ఇవే!!
మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండటంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. అదే సమయంలో విదేశాల నుంచి మనదేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయితే భారతీయ విద్యార్థులు విదేశాలకు భారీగా తరలిపోవడం, వారి ఆదాయ, వ్యయాలు అన్నీ ఇతర దేశాల్లోనే జరుగుతుండటంతో దేశీయ కరెంట్ అకౌంట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
ఉన్నత విద్య చదువుకునేందుకు..
విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి మరింత పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గుతోంది. దీని కారణంగా భారతదేశ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశాల్లో చదువుకుంటూ.. అక్కడే పని చేసుకుంటున్న వారు డబ్బును తిరిగి భారతదేశానికి పంపడం లేదు. ఫలితంగా సుమారు రూ.50 వేల కోట్ల కరెంట్ అకౌంట్ లోటును తెచ్చిపెట్టినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు రిజర్వ్ బ్యాంకు చెబుతున్నదాని ప్రకారం గత పదేళ్లలో భారతీయుల విద్యా ప్రయాణానికి సంబంధించిన వ్యయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2014–15లో రూ.20,597 కోట్ల నుంచి 2023–24లో రూ.52 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 2025 నాటికి దేశం నుంచి విదేశాలకు వేళ్లే విద్యార్థుల మొత్తం ఖర్చు రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
మన విద్యార్థులు ఇష్టపడుతున్న దేశాలు ఇవే..
యునైటెడ్ స్టేట్స్(అమెరికా), కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అధిక ఫీజులు, అత్యధిక జీవన వ్యయాలున్నా భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే, దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారే. నేపాల్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులను భారతదేశానికి పంపుతోంది.
2014–15లో 21 శాతం నుంచి 2021–22లో 28శాతానికి పెరిగింది. 2014–15తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మలేషియా, సూడాన్, నైజీరియా విద్యార్థుల శాతం తగ్గింది. భారత్‌కు ఎక్కువ మంది విద్యార్థులను పంపుతున్న దేశాల వరుసలో ఆఫ్ఘనిస్తాన్ 6.72 శాతంతో రెండో, భూటాన్ 3.33 శాతంతో ఆరో దేశంగా నిలుస్తోంది. 2021–22లో అమెరికా విద్యార్థులు 6.71 శాతంతో మూడో స్థానాన్ని, బంగ్లాదేశ్ 5.55 శాతం, యూఏఈ 4.87 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
TG B.Arch. 2024 Admissions: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ కోర్సుల్లో ప్రవేశాలు.. షెడ్యూల్ విడుదల
ఎన్ని చేసినా ప్రయోజనం స్వల్పమే..
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య క్షీణిస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) 2020ను తెచ్చింది. ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అనేక ప్రతిపాదనలను రూపొందించింది. ఈ క్రమంలోనే యూజీసీ సైతం ద్వంద్వ, ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌లను అనుమతించేలా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
2018లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టుగా స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అత్యుత్తమ స్కాలర్‌షిప్‌లు, ఫీజు మినహాయింపులను అందించేలా రూపొందించింది. అయితే భాగస్వామ్య దేశాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. కానీ, తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో విదేశీ విద్యార్థులను దేశానికి ఆకర్షించడంలో ఈ కార్యక్రమం నత్తనడకన సాగడంతో విఫలమైంది.
ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2014–15 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరాల వరకు విదేశీ విద్యార్థుల నమోదు కేవలం 16.68శాతం మాత్రమే పెరిగిందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా చెబుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ఎఫెక్ట్‌తో విదేశీ విద్యార్థుల సంఖ్య 48,035కు, 2021–22లో 46,878కి తగ్గింది.
దేశంలో అంతర్జాతీయ విద్యార్థుల క్షీణత..
భారతీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో గణనీయమైన క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్‌లో విద్యా సంబంధిత అంశాల ద్వారా వచ్చే ఆదాయం సగానికి సగం తగ్గింది. 2014–15లో రూ.4,345 కోట్ల నుంచి 2023–24కు రూ.2,068 కోట్లకు పడిపోయింది. అయితే 2022–23తో పోలిస్తే కేవలం విదేశీ మారకపు ఆదాయం స్వల్పంగా పెరిగింది. కోవిడ్ తర్వాత 2021–22లో రూ.912 కోట్ల కనిష్ట స్థాయి నుంచి పుంజుకుంది. అయినప్పటికీ 2014–15తో పోలిస్తే చాలా తక్కువగానే నమోదైంది.
Railway Jobs: రైల్వేలో 7951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే
Tags
- Indian students
- Study Abroad
- Study in India
- United States
- Australia
- Canada
- United Kingdom
- Reserve Bank of India
- Domestic Current Account
- Students go Abroad
- Current Account Balance
- Sakshi Education News
- latest education news in telugu
- IndianStudentsAbroad
- StudyAbroadTrends
- InternationalEducation
- EducationExpenditure
- PopularStudyDestinations
- USCanadaUKAustralia
- OverseasEducationCosts
- studentexpenditure2025
- CostOfLivingAbroad
- StudyAbroadStatistics
- StudyAbroad