Skip to main content

Inspiration Story: భ‌ర్త కానిస్టేబుల్‌.. భార్య‌ ఐపీఎస్‌.. 10వ తరగతి కూడా చదవని భార్య‌ను..

పట్టుదల, కృషి ఉంటే మనిషి సాధించాలేది లేదని నిరూపించారు ఈ మహిళ ఐపీఎస్. 14ఏళ్లకు ఒక పోలీసుతో వివాహాం చేశారు. 18 సంవత్సరాలకే ఇద్దరు పిల్లల తల్లి అయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు.
Ambika, IPS
అంబికా, ఐపీఎస్

తన చదువుకు.. భవిష్యత్ కు పెళ్లి, పిల్లలు బాధ్యతలు ఏవీ అడ్డు కావని నిరూపించారు .. తన భర్త కుటుంబం సహకారం తో ఈరోజు లేడీ సింగంగా..దేశ ప్రజలందరి మన్ననలను పొందుతున్నారు ఈ ఐపీఎస్ ఆఫీసర్.

10వ తరగతి కూడా చదవని..

IPS Story


ఓ రోజు అంబికా రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ చూడటానికి తన భర్తతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు లభించిన గౌరవం, ప్రశంసలను చూశారు. అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదని..10వ తరగతి కూడా చదవని అంబికకు నచ్చ చెప్పడానికి చూశాడు. ఐపిఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. కానీ అంబిక తాను కూడా ఎంతకష్టమైనా ఐపీఎస్  సాధించాలనికోరుకున్నారు.

అంతటితో అంబిక...

IPS Family


తన భర్త ఓ ప్రైవేట్ కోచింగ్ కు ఆమెను పంపించాడు. అలా చదివి 10 వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేశారు. అంతటితో అంబిక సంతోష పడలేదు.. సివిల్స్ కు ప్రిపేర్ కావడానికి రెడీ అయ్యారు. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్‌కు సివిల్ సర్వీస్ పరీక్షా కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్ధం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచించి కు చెన్నై పంపించాడు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి, పిల్లలను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.

చివరిసారిగా..
అంబికా సివిల్స్ లో రెండో సార్లు ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఆమె భర్త అంబిక ను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పాడు. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించారు. రెట్టింపు కష్టపడి.. పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్‌ ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె ప్రిలిమ్స్, మెయిన్స్‌, సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. 2008లో ఐపిఎస్ కు అంబిక ఎంపికయ్యారు.

స్ఫూర్తిదాయకంగా...

Ambika, IPS Inspirational Story


హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబాయి నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ‘ముంబాయి సివంగి’ అని లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. విధి నిర్వహణకు, సేవాతత్పరతకు గుర్తింపుగా ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్- 2019’ పురస్కారాన్ని అందుకున్నారు అంబిక. జీవిత కథ కచ్చితంగా కొంత మంది జీవితాలకై నా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అనేక మార్పులు తెస్తుందని చెప్పవచ్చు.

Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

Inspiring Story : విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో..ఆప‌ద్బాంధ‌వుడు..ఈ యువ ఐఏఎస్ కృష్ణ తేజ

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Published date : 10 Jan 2022 06:02PM

Photo Stories